కాంగ్రెస్ సీనియర్ నేత - దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేరున్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు గురించి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేవీపీ ఇటీవల చురుకైన పాత్రను పోషించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన వెనుక ఉన్నదెవరో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమిస్తే బీజేపీ నేతలు బెదరిపోతారనే భ్రమలో కాంగ్రెస్ పార్టీ ఉందని వీర్రాజు ఎద్దేవా చేశారు.
ఇదే సందర్భంగా తన సహజసిద్దమైన శైలిలో మిత్రపక్షమైన టీడీపీపై సైతం వీర్రాజు విరుచుకుపడ్డారు. విఠలాచార్య సినిమాలో వలే గంటలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని అభివృద్ధి చేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించడం లేదని పేర్కొంటూ కేంద్ర మంత్రులను రాష్ర్టానికి రానివ్వమని చెప్పడాన్ని టీడీపీ నేతల విజ్ఞతకే వదలివేస్తున్నామని వీర్రాజు అన్నారు. అమరావతి, అనకాపల్లి ఒకటే అని తాను చెప్పలేదని వీర్రాజు వ్యాఖ్యానించారు. ఏపీ రాజధానికి కూడా మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ భవనం ఉండాలనే భావనతో అలా మాట్లాడానని ఆయన వివరించారు.