అమరావతి. చాలా ఏళ్ళుగా ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న పేరు. అమరావతిలో రాజధాని కట్టాలన్నది చంద్రబాబు కల. అక్కడ రాజధాని కట్టి ప్రపంచానికే అతి పెద్దదిగా చూపించాలని ఆయన తాపత్రయం. ఈ ఉత్సాహంలో బాబు అమరావతి పేరిట గ్రాఫిక్స్ బాగా చూపించారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన లార్జ్ స్కేల్ లో డిజైన్ చేసి కన్న అమరావతి కలలు అలా ఉండగానే అధికారం కోల్పోయారు.
ఇక ఆ తరువాత వచ్చిన జగన్ అమరావతి ఏకైక రాజధాని కాదు అని తేల్చేశారు. మూడు రాజధానులే ముద్దు అని అని గంభీరంగా ప్రకటించారు. జగన్ అధికారం సగానికి సగం పూర్తి అయింది. అయితే అమరావతికి అతీ గతీ లేదు మూడు రాజధానుల ముచ్చట కూడా అంతకంటే లేదు. దాంతో ఏపీలో రాజధాని లేని అయోమయం నెలకొంది. మరో వైపు అమరావతియే ఏపీకి రాజధానిగా ఉంచాలంటూ రైతులు రెండేళ్ల పాటు ఆందోళన చేశారు.
అయినా మూడు రాజధానులకే మేము కట్టుబడి ఉన్నామని జగన్ అసెంబ్లీ వేదికగా స్పష్టంగా ప్రకటించేశారు. ఇక వైసీపీ ఏలుబడిలో అమరావతి కధ ముందుకు సాగదని అర్ధమైపోయింది. ఈ నేపధ్యంలో అమరావతి రాజధానికి అందరి మద్దతు దక్కుతోంది. కామ్రేడ్స్, కమలదళం అన్న తేడా లేకుండా కుడి ఎడమ పార్టీలు అన్నీ కూడా అమరావతి మన రాజధాని అని ఎలుగెత్తి చాటుతున్నారు. అమరావతి రైతుల ఆందోళనలలో బీజేపీ కూడా పాల్గొంది. తాము ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామని కూడా ఆ పార్టీ ఇప్పటికే చెప్పుకుంది.
లేటెస్ట్ గా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతిని తాము అధికారంలోకి వస్తే మూడేళ్లలో కట్టి చూపిస్తామని చెప్పారు. పది వేల కోట్ల రూపాయలను ఇందుకోసం కేటాయిస్తామని కూడా ప్రకటించారు. క్రిష్ణా జిల్లాలలోని పెనుగంచిప్రోలు అమ్మవారిని దర్శించుకున్న ఆయన ఆమ్మవారి సాక్షిగా ఇదే మా మాట అని కూడా గట్టిగా చెప్పేశారు. మేము అమరావతిని కట్టి ఏపీకి రాజధాని కళ కట్టిస్తామని అంటున్నారు.
నాడు చంద్రబాబు అమరావతికి ఖర్చు పెట్టిన ఏడువేల రెండు వందల కోట్లలో సింహ భాగం బీజేపీ కేంద్రం నుంచి ఇచ్చినదే అని కూడా సోము కొత్త మాట చెప్పారు. మోడీ సర్కార్ అమరావతి రాజధాని నిర్మాణం పట్ల చిత్తశుద్ధితో ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తానికి అమరావతి రాజధాని కలలను ఇంకిపోనీయకుండా తరచూ బీజేపీ చేస్తున్న ఈ ప్రకటనలో బలమెంత, వాటిని రాజధాని రైతులు ఎంతవరకూ విశ్వసిస్తున్నారు అన్నది కూడా చూడాలి.