ఎబ్బెట్టుగా ఉన్న బాబు మీద పాట‌

Update: 2015-10-22 10:08 GMT
అమ‌రావ‌తి శంకుస్థాప‌న సంద‌ర్భంగా ఆల‌పించిన బాబు మీద పాట ఆహుతుల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. పార్టీ కార్య‌క్ర‌మంలో వినిపించే గీతాన్ని.. ఏపీ స‌ర్కారు నేతృత్వంలో నిర్వ‌హించే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలో మ‌రీ.. వ్య‌క్తిపూజ‌కు అవ‌కాశం ఇచ్చేలా పాడ‌టం ప‌లువురిని విస్మ‌య‌ప‌ర్చింది. మ‌హానాడు కార్య‌క్ర‌మం లాంటి వాటిల్లో వినిపించే పాట‌ను.. అమ‌రావ‌తి శంకుస్థాప‌న లాంటి చారిత్ర‌క కార్య‌క్ర‌మంలో వినిపించ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

దేశ‌దేశాల‌తో దోస్తీ చేశాడు.. ఏ మాట‌కు ఆ మాటే చెప్పుకోవాలి చంద్ర‌బాబు పాల‌నే చెప్పుకోవాలి.. పంచ‌భూతాల‌కే ఎదురు నిలిచాడు.. స్వ‌ర్ణాంధ్ర బాట‌లు చూడు.. చంద్ర‌బాబు పాల‌న చూడు.. ఏ నోము ఫ‌ల‌మో చంద్ర‌బాబు పాల‌న‌.. 8 గంట‌లు క‌ష్టం చూడు.. ప‌గ‌ల‌న‌క రాత్ర‌న‌క ప‌ని చేసే బాబును చూడు లాంటి ప‌దాల‌తో ఆల‌పించిన గీతం ఎబ్బెట్టుగా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

పెద్ద ఎత్తున వీవీఐపీలు.. ఇత‌ర రాష్ట్రాల రాజ‌కీయ నేత‌లు విచ్చేసిన కార్య‌క్ర‌మంలో హుందాగా ఉండే పాట‌ల స్థానే.. ఇలాంటి గీతాల్ని ఆల‌పించ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లు వేసుకోవ‌టం క‌నిపించింది.
Tags:    

Similar News