ప్రశాంత్ దాటకూడని లైన్ దాటారా?

Update: 2016-11-07 06:50 GMT
భారత రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ ఒక సంచలనం. తన వ్యూహాలతో గెలుపు గుర్రాల్ని డిసైడ్ చేసే వ్యక్తిగా ఆయనకు పేరుంది. దీనికి తగ్గట్లే ఆయన మేజిక్ పలుదఫాలు సక్సెస్ కావటంతో రాజకీయ పార్టీలకు ఆయన్ను అద్భుత శక్తిగా భావిస్తుంటారు. తన వ్యూహాలతో విపక్షంలో ఉన్న పార్టీలను అధికారపక్షంగా మార్చే సత్తా ప్రశాంత్ కిశోర్ కు ఉందన్న నమ్మకాన్ని పలువురు వ్యక్తం చేస్తుంటారు. 2014 ఎన్నికల సమయంలో మోడీ కోసం పని చేసిన ప్రశాంత్.. ఎన్డీయే ఘన విజయం సాధించటంలో కీలకభూమిక పోషించారు.

దీనికి కొనసాగింపుగా.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నితీశ్.. లాలూ కోసం పని చేసిన ఆయన.. ఆ రెండింటికి చారిత్రక విజయాన్ని అందించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన ప్రశాంత్ కిశోర్.. తన బుర్రకు పదునుపెట్టి పలు వ్యూహాలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఖాట్ చర్చా మొదలు.. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందస్తుగా ప్రకటించటం మొదలు.. భారీ ప్రచారాన్ని అందరి కంటే ముందు స్టార్ట్ చేయటం లాంటివి షురూ చేశారు.

గత ఎన్నికలకు భిన్నంగా యూపీ ఎన్నికల కోసం ప్రశాంత్ పన్నుతున్న ఎన్నికల వ్యూహాలు వర్క్ వుట్ కావటం లేదన్న భావనను కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడైన ప్రశాంత్ కిశోర్ వ్యూహ చతురత పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అంత సంతృప్తితోలేరని చెబుతున్నారు.ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన సమాజ్ వాదీ చీఫ్.. యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇంటికి వెళ్లిన విషయం బయటకు వచ్చింది. ఇది కాంగ్రెస్ అధినేత్రికి మరింత కోపాన్ని పెంచిందని చెబుతున్నారు.

అయితే.. ములాయంతో ప్రశాంత్ భేటీ వెనుక కారణం వేరే అన్న వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు అంశం చర్చించేందుకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా..  యూపీ ఎన్నికల్లో ప్రశాంత్ వ్యూహాల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ కు.. తాజాగా ఆయన అమలు చేసిన కొన్ని వ్యూహాలు పాజిటివ్ రిజల్ట్ రాలేదన్న భావనలో కాంగ్రెస్ ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News