మోడీ స‌ర్కారు దుర్మార్గాన్ని చెప్పిన సోనియ‌మ్మ

Update: 2017-06-07 05:03 GMT
దీర్ఘ‌కాలంగా అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చాలాకాలం త‌ర్వాత మోడీ స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హాన్ని.. అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఆమె నేతృత్వంలో తాజాగా సీడ‌బ్ల్యూసీ స‌మావేశం జ‌రిగింది. గ‌డిచిన కొద్దికాలంగా ఈ స‌మావేశంలో పాల్గొన‌ని సోనియా.. నిన్న‌ భేటీకి హాజ‌రు కావ‌ట‌మే కాదు.. మోడీ స‌ర్కారు తీరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అనారోగ్యం కార‌ణంగా గ‌డిచిన కొంత‌కాలంగా సీడ‌బ్ల్యూసీ భేటీకి ఆమె హాజ‌రు కావ‌టం లేదు. మోడీ స‌ర్కారుపై సోనియ‌మ్మ చేసిన తీవ్ర విమ‌ర్శ‌ల్ని చూస్తే..

+ మోడీ ఓ నియంత‌. నియంతృత్వ విధానాల‌తో వ్య‌వ‌స్థ‌లు.. రాజ‌కీయ పార్టీలు.. పౌర స‌మాజం.. మీడియా గొంతును నొక్కాల‌ని చూస్తున్నారు.

+ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు.. వ్య‌తిరేకంగా మాట్లాడే వారి గొంతును నొక్కేసేందుకు కేంద్రం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోంది.

+ భార‌తీయ విలువ‌లు.. మూలాల్ని నాశ‌నం చేసేందుకు మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంది. వాటిని కాపాడ‌ట‌మే లక్ష్యంగా 2019 ఎన్నిక‌ల‌కు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి.

+ ప్ర‌భుత్వ అవినీతి బ‌య‌ప‌డ‌కుండా అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను తొక్కి పెడుతున్నారు. దేశ ప్ర‌జ‌ల న‌డుమ విభ‌జ‌న తీసుకొచ్చే ఆలోచ‌న‌ల్ని మోడీ స‌ర్కారు పెంచి పోషిస్తోంది.

+ ప్ర‌జ‌ల జీవ‌న‌విధానాలు.. ఆహార అల‌వాట్ల పైనా దాడి చేస్తోంది

+ ఇలాంటి ధోర‌ణి ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. భార‌త‌దేశ విలువ‌లు కాపాడేందుకు సిద్ధంగా ఉండాలి

+ పెద్ద‌నోట్ల ర‌ద్దు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. జీడీపీ గ‌ణాంకాలు అదే విష‌యాన్ని చెబుతున్నాయి. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఏదైతే ఊహించారో అదే నిజ‌మైంది. నోట్ల ర‌ద్దును మోడీ స‌ర్కారు గొప్ప విజ‌యంగా చెబుతున్నాయి. కానీ.. స‌ర్కారు తీరుతో బ్యాంకుల‌కు మేలు చేకూరింది.

+ నోట్ల ర‌ద్దుతో బ్యాంకుల‌కు ఎంత మేర లాభం క‌లిగింద‌న్న విష‌యాన్ని వారు చెప్ప‌టం లేదు. దేశంలో ఎప్పుడూ లేని రీతిలో నిరుద్యోగం పెరిగింది.

+ మోడీ స‌ర్కారు వైఫ‌ల్యానికి జ‌మ్ముకాశ్మీర్ ఒక్క‌టి చాలు. ఎన్డీయే వ‌చ్చాక ఉగ్ర‌దాడులు తీవ్ర‌మ‌య్యాయి. మోడీ స‌ర్కారు తీరుతో జ‌మ్మూకాశ్మీర్ ప్ర‌జ‌ల్లో తీవ్ర భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

+ రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. దేశంలో అస‌హ‌నం విప‌రీతంగా పెరిగిపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News