గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు అత్యధిక కాలం పాటు అధ్యక్షురాలిగా కొనసాగిన నేతగా రికార్డు పుటలకెక్కిన ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు - రాయబరేలీ ఎంపీ సోనియా గాంధీకి దాదాపుగా 19 ఏళ్ల తర్వాత రెస్ట్ దొరికేసింది. పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఏమాత్రం తీరిక లేకుండా పార్టీ పురోభివృద్ధి కోసం అహరహం శ్రమించిన సోనియా గాంధీ... పార్టీ కోసం అందివచ్చిన ప్రధాని పదవిని కూడా తృణప్రాయంగా త్యజించేశారు. ప్రధాని పదవి దక్కని రాజకీయాలు తనకు ఎందుకు? అనుకోలేదు సోనియా. ఆ తర్వాత కూడా సుదీర్ఘంగా పార్టీకి ఆమె అధ్యక్షురాలిగానే కొనసాగారు. తాజా తన కుమారుడు - మొన్నటిదాకా పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన రాహుల్ గాంధీ... పార్టీ పగ్గాలను పూర్తి స్థాయిలో తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో దాదాపుగా 19 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సోనియా గాంధీకి కాస్తంత రెస్ట్ టైమ్ దొరికేసింది.
ఇప్పటికే తీవ్ర అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న సోనియా గాంధీ పలుమార్లు ఆసుపత్రుల్లో రోజుల తరబడి కూడా ఉన్నారు. ఆ సమయంలోనూ ఆసుపత్రి నుంచి రాగానే తిరిగి పార్టీ కార్యకలాపాల్లో మునిగిపోయేవారు. ఈ క్రమంలో అనారోగ్యం చుట్టుముట్టిన సోనియాకు రెస్ట్ కావాల్సిందేన్న వాదన వినిపించింది. అయితే పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే నేత కనుచూపు మేరలో కనిపించని నేపథ్యంలో కష్టమైనా - నష్టమైనా సోనియానే మొన్నటిదాకా అధ్యక్షురాలిగా బాధ్యతలను మోశారు. ఇప్పుడు రాహుల్ పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజంగానే సోనియాకు రెస్ట్ దొరికేసింది. ఈ రెస్ట్ లో కాస్తంత బిజీబిజీ పొలిటికల్ వ్యవహారాలకు కాస్తంత దూరంగా ఉందామని భావించిన సోనియా... నేరుగా గోవా ఫ్లైట్ ఎక్కేశారట. దక్షిణ గోవాలోని ఓ బీచ్ రిసార్ట్స్ లో బస చేసిన ఆమె అక్కడే రెస్ట్ తీసుకుంటున్నారట.
ఈ రెస్ట్ సమయంలో సోనియా ఏమేం చేస్తున్నారన్న విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తాను బస చేసిన బీచ్ రిసార్ట్‌కు వచ్చే వారిని పలకరిస్తూ - మార్నింగ్ వాక్ కో - ఈవెనింగ్ వాక్ కో బయటకు వెళ్లినప్పుడు తనకు కనిపించిన గోవా ప్రజలతో మాటా మంతీ కలుపుతున్నారట. అంతేకాందడోయ్... మొన్నటిదాకా తనను ముప్పుతిప్పలు పెట్టిన అనారోగ్యానికి చెక్ పెట్టేందుకు ఏకంగా ఆమె బీచ్ లో సైక్లింగ్ కూడా చేస్తున్నారట. తమను పలకరించిన సోనియాతో సెల్ఫీలు తీసుకున్న కొందరు సదరు ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టేశారు. అదే సమయంలో సోనియా సైక్లింగ్ చేస్తున్నప్పుడు కూడా కొందరు ఫొటోలు తీసి వాటిని నెట్‌లో అప్ లోడ్ చేశారట. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా... సోనియాకు ఎట్టకేలకు రెస్ట్ దొరికిందిలే అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారట.