కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తల్లి పావోలా మైనో ఇటలీలోని తన స్వగృహంలో కన్నుమూశారు. సోనియా తల్లి పావోలా ఆగస్టు 27 న తుది శ్వాస విడిచారు. మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు.
సోనియా గాంధీ తల్లి 90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన తల్లిని కలవడానికి సోనియా గాంధీ ఆగస్టు 23న ఇటలీకి వెళ్లారు. సోనియాతోపాటు రాహుల్ మరియు ప్రియాంక గాంధీ కూడా ఇటలీ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీలో ఉన్నారు. సోనియా కుటుంబంలో ఇది విషాదం నింపింది.
కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్ ఈ వార్తను ధ్రువీకరించింది. మరణించిన సోనియా తల్లి మైనో ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థించారు. మృతుల కుటుంబానికి కాంగ్రెస్ , ఇతర పార్టీల శ్రేణులు సంఘీభావం తెలిపారు.
పోలా మృతి పట్ల తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. “ సోనియా గాంధీజీకి ఆమె తల్లి మరణించినందుకు ప్రగాఢ సానుభూతి. ఈ నష్టాన్ని తట్టుకునే శక్తి ఆ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.