ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఏపీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై మే 13న చర్చ.. ఆపై ఓటింగ్ జరగనుంది. రాజ్యసభలో కాంగ్రెస్ కు పెద్ద సంఖ్యలు సభ్యులు ఉండటం.. ఎన్డీయే సర్కారును ఇబ్బంది పెట్టేందుకు వీలుగా సోనియమ్మ కేవీపీ ప్రైవేటు బిల్లును వాడుకోవాలని చూస్తున్నారు.
ఇందులో భాగంగా తాజాగా కాంగ్రెస్ రాజ్యసభ్యులకు మూడు లైన్లలో ఒక విప్ ను కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ విడుదల చేశారు. కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లుపై జరిగే చర్చకు.. ఓటింగ్ లోనూ తప్పినసరిగా పాల్గొనాలంటూ సోనియమ్మ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పరిణామాలు ఆసక్తికరంగా మారనున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదా అంశంపై కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లు ఎన్డీయే సర్కారుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
విభజనతో ఏపీకి ఎంతో నష్టం వాటిల్లేలా చేసిన సోనియమ్మ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారును దారికి వచ్చేలా సోనియమ్మ వ్యూహంలో భాగంగానే కేవీపీ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారన్న వాదన వినిపిస్తోంది. ఈ బిల్లు కానీ పాస్ అయితే.. ఏపీ విభజన బిల్లుకు మార్పులు చేసే వీలు కలుగుతుంది. అదే జరిగితే.. ఏపీ భవిష్యత్తు బంగారంగా ఉంటుందన్న ఆయన.. ఇప్పటికే నాలుగైదు పార్టీలతో చర్చలు జరిపామని.. వారు బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని చెప్పినట్లుగా రఘువీరా వెల్లడించారు.
కేవీసీ ప్రవేశపెట్టిన బిల్లు కానీ పాస్ అయితే.. ఏపీ ప్రత్యేక హోదా మీద మొండిగా ఉన్న మోడీ పరిస్థితి ఏమిటన్నది ఒక ప్రశ్న. ప్రైవేటు బిల్లుతో తమను ఒత్తిడికి గురి చేయాలని భావిస్తున్న సోనియమ్మ ప్లాన్ కు.. మోడీ పరివారం ఎలాంటి కౌంటర్ రెఢీ చేస్తుందో చూడాలి.