ఒకప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలంటే చేతి వేళ్లతో లెక్క పెట్టే రీతిలో ఒకట్రెండు రాష్ట్రాల్లోనే కనిపించేవి. అందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. దక్షిణాది మినహాయించి.. యావత్ దేశం కమలనాథులతో నిండిపోయింది. ఒకప్పుడు తాము ఎలా అయితే ఉండేవారిమో ఇప్పుడు బీజేపీ అలా మారిందన్న వేదన కాంగ్రెస్ నేతల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎలా అయినా సరే.. తిరిగి పవర్ చేతిలోకి తీసుకోవాలన్న తపన వారిలో ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో పార్టీ పగ్గాలు చేపట్టే అర్హత ఎవరికుందన్న విషయంపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న రాహుల్ తన పదవికి రాజీనామా చేయటం.. మరోసారి పగ్గాలు చేపట్టిన సోనియా.. పార్టీలోని పరిస్థితిని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కిందామీదా పడుతున్నారు. తాజాగా తాము పవర్లో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోనియాగాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వారు పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పజెప్పాలంటూ ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో సోనియా ముందుకు ప్రియాంకకు పార్టీ పగ్గాలన్న అంశాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురాగా.. మిగిలిన వారు సైతం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోనియా నివాసంలో జరిగిన ఈ మీటింగ్ లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్.. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామిలు పాల్గొన్నారు. పార్టీ ఫ్యూచర్ ప్లాన్ మీద వ్యూహరచన చేసిన వారు.. బీజేపీని అడ్డుకునేందుకు వీలుగా ప్రియాంకను రంగంలోకి తీసుకురావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
పార్టీ సంస్థాగత ఎన్నికల తర్వాత నాయకత్వ బాధ్యతల్ని ప్రియాంక స్వీకరించకపోతే మోడీని ఎదుర్కోవటం చాలా కష్టమని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటలు విన్న తన మనసులోని మాట బయటపెట్టకుండానే మీటింగ్ ముగించినట్లుగా తెలుస్తోంది.