కోర్టుకు వెళ్లే ముందు ‘అమ్మ’ ఏం చేశారంటే..?

Update: 2015-12-20 04:19 GMT
తన కనుసైగతో దేశాన్ని శాసించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. శనివారం ఢిల్లీలోని పాటియాలా హౌజ్ లోని న్యాయస్థానానికి వెళ్లటం.. వెంటనే బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కోర్టు లోపలకు అడుగు పెట్టే క్రమంలో ఆమ్మ చేసిన ఒక పని కొందరి దృష్టిని ఆకర్షించింది. శనివారం మధ్యాహ్నం సుమారు2.30 గంటల సమయంలో పాటియాలా కోర్టుకు తన కొడుకు రాహుల్ తో కలిసి సోనియాగాంధీ వచ్చారు.

ఈ సమయంలో కోర్టు వెలుపలా పెద్ద ఎత్తున జన ప్రవాహం ఉంది. వారంతా కాంగ్రెస్ నేతలు..కార్యకర్తలే. వీరంతా సోనియాకు అనుకూలంగా.. కేంద్ర సర్కార్.. ముఖ్యంగా మోడీపై తీవ్రంగా విమర్శలు చూస్తే.. నినాదాలు ఇస్తున్నారు. వాహనం దిగి కోర్టుకు వెళ్లే క్రమంలో కొడుకుతోపాటు నడిచిన సోనియాగాంధీ.. కొద్ది సెకన్లు ఆగిపోయారు. తనకు అభివాదం చెబుతున్న వారి నినాదాలకు స్పందనగా ఆమె తన రెండు చేతి వేళ్లను ‘‘విక్టరీ’’ సింబల్ తో అలరించే ప్రయత్నం చేశారు.

అప్పటివరకూ కోర్టు బయట ఉన్న వారిలో రాహుల్ మొదట కోర్టు భవన సముదాయంలోపలికి అడుగు పెట్టే ప్రయత్నంలో పక్కనున్న అమ్మ కోసం చూశారు. అప్పటికే అమ్మ.. ప్రజలకు విక్టరీ సింబల్ తో అభివాదం చేస్తున్నారు. రాహుల్ గాంధీ తన వెంటే ఉండాలంటూ సైగ చేయటం.. ఆమె చకచకా రాహుల్ అండ్ కో వద్దకు వచ్చేశారు. అనంతరం వారంతా కోర్టు ప్రాంగణంలోకి వెళ్లిపోవటంతో.. కెమేరా కన్ను వారిపై పడని పరిస్థితి.

కోర్టు గుమ్మం దగ్గరకు వెళ్లే సమయంలో విక్టరీ సింబల్ చూసిస్తూ.. కాస్త ఆనందంగా సోనియా కనిపించటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరుక్కున్న ఆమె కోర్టుకు హాజరయ్యే సమయంలో విక్టరీ సింబల్ చూపించటం అంటే.. ఈ కేసు తనపై ఎలాంటి ప్రభావం చూపించదనా? లేక.. భవిష్యత్తులో ఎలాంటి చికాకులు ఉండవని సోనియా భావిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఏదో ఘనకార్యం చేసినట్లుగా కోర్టుకు వెళుతూ.. విక్టరీ సింబల్ చూపించటం ఏమిటో...?
Tags:    

Similar News