ఉత్త‌మ్ దూకుడు సోనియా కూడా మెచ్చిన‌ట్లే!!

Update: 2018-09-06 04:10 GMT
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం కావాలని ప్ర‌క‌టించ‌డం, ప్ర‌గ‌తి నివేద‌న స‌భ పేరుతో ప్ర‌జ‌ల‌కు చేరువ అవ‌డం, దాని అనంత‌రం ప్రజా ఆశీర్వాద సభకు స్కెచ్ వేసిన నేప‌థ్యం... ముంద‌స్తు కోసం క్యాబినెట్‌ను స‌మావేశ‌ప‌ర్చ‌డంతో టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు మీద ఉన్న నేప‌థ్యంలో...ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ సైతం త‌న అస్త్రాల‌ను వెలికి తీస్తోంది. కేసీఆర్‌ను ధీటుగానే ఎదుర్కోవాల‌ని డిసైడైన పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ఇప్ప‌టికే మ్యానిఫెస్టోను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటుగా ఈసారి అధికారాన్ని ఎలాగైనా జేజిక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌.. తమ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలపై కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఇవాళ టీఆర్ ఎస్‌ నేత శివకుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ చార్జి కుంతియా - టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

పీసీసీ చీప్ ఉత్త‌మ్ దూకుడు నేప‌థ్యం - కాంగ్రెస్ నేత‌లంతా ఒక్క‌తాటి మీద‌కు వ‌స్తున్న క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ అన‌ధికారిక ర‌థ‌సార‌థి సోనియాగాంధీ సైతం తెలంగాణ‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. కీల‌క‌మైన స‌భ‌లు నిర్వ‌హించాల‌నే యోచ‌న‌ - త‌న రాక‌ను ప్రాధాన్యంగా పేర్కొంటున్న నేప‌థ్యంలో ఈ నెల 14న తెలంగాణలో సోనియా గాంధీ ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లేదంటే కరీంనగర్‌ లో  సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ సభను ఏర్పాటు ద్వారా కేసీఆర్‌కు పెద్ద ఎత్తున అండ‌గా జిల్లాల్లోనే మొద‌ట త‌మ స‌త్తా చాటాల‌ని పీసీసీ చీఫ్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

కాగా, ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌ ఓ అడుగు ముందుకేసీ ఇవాళే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అనంత‌రం పార్టీలోని అసంతృప్త నేత‌లైన మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ - మాజీ మంత్రి ముఖేష్ గౌడ్‌తో పీసీసీ చీఫ్ స‌మావేశ‌మ‌య్యారు. వారితో భేటీలో పాల్గొన్న సంద‌ర్భంగా పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టివిక్ర‌మార్క‌ - పార్టీ ముఖ్యుల‌తో కూడా అక్క‌డికి వెళ్లి తామంతా ఒక్క‌టేన‌నే సందేశం చాటారు.
Tags:    

Similar News