కొంత కాలంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతతో ఉన్న విషయం తెలిసేందే. మొన్నటికి మొన్న ఇంటి పక్కనే ఉన్న పార్టీ ఆఫీసులో జరిగే ముఖ్యమైన సమావేశానికి సైతం ఆరోగ్యం సరిగా లేదని డుమ్మా కొట్టిన ఆమె.. తాజాగా గోవాలో ప్రత్యక్షమై అధికారులకు షాకిచ్చారు. సోనియాగాంధీ లాంటి ప్రముఖురాలు ఎక్కడికైనా వస్తున్నరంటే ముందస్తుగా సమాచారం అందించటం.. ఆమె స్థాయికి తగ్గట్లుగా ఏర్పాట్లు చూడటంతో పాటు..నిఘా వర్గాలు సైతం అలెర్ట్ గా ఉంటాయి.
కానీ.. తాజాగా గోవాలో కాంగ్రెస్ అమ్మ జరిపిన పర్యటన ఎలాంటి సమాచారం అందకుండా గుట్టుచప్పుడు కాకుండా జరగటంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ.. కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే పూర్తి చేశారని చెబుతున్నారు. వారం రోజుల పాటు సాగిన గోవా టూర్ మంగళవారం ముగిసింది.
గుట్టుచప్పుడు కాకుండా వారం నుంచి గోవాలో ఉన్న ఆమె.. మంగళవారం బెనాలిమ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక పెయింట్ ఎగ్జిబిషన్ కు హాజరయ్యారు. ఇక్కడికి వస్తున్నట్లుగా భద్రతా సిబ్బందికి ఎలాంటి సమాచారం అందలేదు. అత్యంత సాదాసీదాగా సోనియా వచ్చినట్లుగా తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. వ్యక్తిగత పర్యటన అని చెబుతున్నా.. ఆరోగ్యం సరిగా లేని సోనియమ్మ వారం రోజులు గోవాలో ఏం చేసినట్లు? అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/