రియల్ హీరోకి రీల్ హీరో కి తేడా చూపించారు స్టార్ యాక్టర్ సోనూసూద్. లాక్ డౌన్ సమయంలో ఉన్నచోట ఉపాధిలేక, ఉండేందుకు నీడ లేక తమ సొంత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో సోనూసూద్ వలస కూలీలకి సహాయంగా నిలిచారు. నిత్యం సుమారు 45 వేల మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసారు. అలాగే వలస కూలీల కోసం ప్రత్యేకంగా బస్సులు, విమానాలు, ట్రైన్ లు ఇలా ఏర్పాటు చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. సినిమాల ద్వారా గత 20 ఏళ్లలో కూడబెట్టిన డబ్బు మొత్తాన్ని వలస కూలీల కష్టాలు తీర్చడానికి ఉపయోగిస్తున్నారు.
ఇంతలా వలసకూలీల కోసం కష్టపడుతుంటే చేతనైతే ప్రశంసించాల్సి పోయి శివసేన నేత సంజయ్ రౌత్ నోరు పారేసుకున్నారు. ఆయన నేటి మహాత్మా అవ్వాలనుకుంటున్నారా అంటూ రకరకాల కామెంట్స్ చేశారు. అయితే ఆయన కామెంట్ చేసిన మరుసటి రోజే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే మంత్రి ఆదిత్య థాకరేతో సోనుసూద్ సమావేశమయ్యారు.
ఆదివారం రాత్రి ముంబైలోని ఉద్దవ్ నివాసం మాతో శ్రీ లో సోనుసూద్ ఉద్దవ్, ఆదిత్యతో సమావేశమై, వలసకూలీల సాయంపై చర్చించారు. తర్వాత సోనుసూద్ చేసిన సాయాన్ని సీఎం ఉద్దవ్ థాకరే ప్రసంశించారు. ముంబైలో ఉన్న ఉత్తరాదికి చెందిన వలస కూలీలను తరలించడం పై ప్రశంసలు కురిపించారు. అయితే అంతకుముందు శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించగా.. ఒక్క రోజులోనే ఉద్దవ్ ప్రశంసించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే , సోనూసూద్ పై శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా శివసేనపై ఆగ్రహం వ్యక్తం అయ్యింది. పలువురు శివసేనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ తో సీఎం భేటీ కావడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగానే సోనూసూద్ తో సీఎం ఉద్దవ్ భేటీ అయ్యారంటూ రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా పార్టీ ఎంపీ ఒకరిపై విమర్శలు కురిపించిన ఒక్క రోజులోనే సీఎం అతని పై ప్రశంసలు కురిపించడంతో మహా రాజకీయంలో ఈ మలుపు ఏంటో అని అందరూ చర్చించుకుంటున్నారు.