భారత మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు , ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయనకు మళ్లీ ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన కోలకతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గుండెపోటుకు గురై , కోలుకున్న దాదా మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, గంగూలీకి మంగళవారం ఛాతీలో కొంచెం నొప్పిగా అనిపించింది. కానీ బుధవారం ఆ నొప్పి మరింత పెరగడంతో గ్రీన్ కారిడార్ ద్వారా ముందు జాగ్రత్తగా గంగూలీని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవల సౌరవ్ గంగూలీకి గుండెపోటు రావడంతో డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేసిన సంగతి తెలిసిందే. దాని నుంచి పూర్తిగా కోలుకుని గంగూలీ జనవరి 7వ తేదీన వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదా మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త అయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.