రాజకీయ ప్రవేశంపై సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. వచ్చేస్తున్నట్టేనా?!
‘‘నా జీవితంలో చాలా విషయాలు హఠాత్తుగా జరిగాయి.. చూద్దాం ఎక్కడిదాకా వెళ్తుందో..’’ ఇదీ.. పొలిటికల్ ఎంట్రీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు బెంగాల్లో హోరాహోరీగా ఎన్నికల పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తారా? అని అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు దాదా.
అంతేకాదు.. తన లైఫ్ లోని చాలా సంఘటనలు అకస్మాత్తుగా జరిగాయని చెప్పారు. ‘‘నా జీవితంలో చాలా విషయాలు హఠాత్తుగా జరిగినవే. సచిన్ కెప్టన్సీ తీసుకుని ఉంటే నాకు ఛాన్స్ వచ్చేది కాదు. కానీ.. అతడు తప్పుకున్నాడు. దాంతో నాకు బాధ్యతలు వచ్చాయి. బీసీసీఐ అధ్యక్ష పదవి కూడా అలాగే వచ్చింది. కొన్ని నిమిషాల ముందు వరకూ ఆ విషయం నాకు తెలియదు. నా జీవితం ఎప్పుడూ ఇలానే సాగుతోంది’’ అని చెప్పాడు గంగూలీ.
ఇక, సౌరవ్ రాజకీయ అరంగేట్రంపై ఎప్పటి నుంచో చర్చ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు దాదా. తనకు రాజకీయ అవకాశాలు చాలా వచ్చాయని, కానీ.. తానే పక్కన పెడుతూ వస్తున్నానని అన్నారు. కుటుంబం, ఆరోగ్యం, జీవనశైలి వంటివన్నీ రాజకీయాల ద్వారా ప్రభావితం అవుతాయని చెప్పారు.
ప్రజలకు తనపై ఈ స్థాయిలో అభిమానం ఉండడం సంతోషంగా ఉందన్నాడు దాదా. అందుకే.. వారిని ఎల్లప్పుడూ కలుస్తుంటానని చెప్పారు. అయితే.. రాజకీయాల్లో తాను రానని కరాఖండిగా చెప్పలేదు. అదే సందర్భంలో ఏదైనా జరగొచ్చు అని చెప్పడంతో.. సౌరవ్ పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.