బ్యాడ్ లక్ కు పెద్దన్న దక్షిణాఫ్రికా.. టి20 ప్రపంచ కప్ లో నెదర్లాండ్స్ చేతిలో ఓటమి..
ఇంగ్లండ్ ను ఐర్లాండ్ ఓడించింది.. పాకిస్థాన్ కు జింబాబ్వే షాకిచ్చింది.. వాటన్నిటికీ మించి టి20 ప్రపంచ కప్ లో అతి పెద్ద సంచలనం.. పసికూనల్లో కూన అయిన నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఆదివారం సూపర్ 12లో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టార్గెట్ 159 కాగా.. నిర్ణీత 20 ఓవర్లలో 145/8 స్కోర్ మాత్రమే చేసింది. నెదర్లాండ్స్ చేతిలో ఓటమితో టీ20 ప్రపంచకప్ నుంచి సౌతాఫ్రికా నిష్క్రమించింది. నెదర్లాండ్స్ సంచలన విజయంతో.. చివరి మ్యాచ్ గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది.
పాక్ - బంగ్లాదేశ్ మ్యాచ్‌లో గెలిచిన వారు గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్తు ఛేజిక్కించుకోనున్నారు.
గెలిస్తే నేరుగా సెమీస్.. కానీ అది దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా అంటేనే ప్రపంచ కప్ లలో బ్యాడ్ లకు పెద్దన్న. 1992 ప్రపంచ కప్ సెమీఫైనల్స్ నుంచి ఇది కొనసాగుతోంది. అత్యుత్తమ జట్టు ఉన్నా.. పెద్ద టోర్నీ అనేసరికి దక్షిణాఫ్రికా తడబడుతుంది. లాన్స్ క్లూసెనర్ వంటి మేటి ఆల్ రౌండర్ క్రీజులో ఉన్నా.. ఆస్ట్రేలియాతో జరిగిన 1999 సెమీఫైనల్స్ దీనికి పరాకాష్ఠ. అసలు తొలి టి20 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలోనే జరిగింది. కానీ, ఆ జట్టు కనీసం సెమీస్ చేరలేదు. 2003 వన్డే ప్రపంచ కప్ లో అయితే దారుణ ప్రదర్శన. ఇలా చెప్పుకొంటూ పోతే ఆ జట్టు ప్రపంచ కప్ లలో ఎదుర్కొన్న పరాభవాలు లెక్కేలేదు.
టి20 ప్రపంచ కప్ లలూ దీనికి మినహాయింపు కాదు. వాస్తవానికి ఆదివారం నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిస్తే నేరుగా సెమీస్ చేరేది. కానీ, అనూహ్యంగా ఓడింది. దీన్నిబట్టే ప్రపంచ కప్ లలో దక్షిణాఫ్రికాను బ్యాడ్ లక్ వెంటాడుతుందో...?
నెదర్లాండ్స్ చేతిలో ఓటమా...?
ఈ ప్రపంచ కప్ సూపర్ 12 దశకు అర్హత సాధించిన జట్లలో అతి బలహీనమైన జట్టు ఏదంటే నెదర్లాండ్స్. ప్రపంచ కప్ హాట్ ఫేవరెట్లలో ఒకటి ఏదంటే దక్షిణాఫ్రికా. అలాంటి జట్ల మధ్య మ్యాచ్ లో.. అది కూడా సెమీస్ కు చేరేందుకు కీలకమైన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓడిందంటే ఆ జట్టును ఏదో శని వెంటాడుతుందని అనుకోవాలి. కెప్టెన్ తప్ప.. అందరూ అద్భుతమైన ఆటగాళ్లు.. మేటి పేసర్లు.. భారీ హిట్టర్లు.. కానీ వీరికి మించి బ్యాడ్ లక్ ఆ జట్టుకుంది.
భారత్ కు తేలిక..
నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమితో భారత్ నేరుగా సెమీస్ కు వెళ్లిపోయింది. గ్రూప్ 2 టాపర్ గానూ నిలిచింది. వాస్తవానికి దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో జింబాబ్వే మ్యాచ్ లో గెలుపోటములతో సంబంధం లేకుండా భారత్ సెమీఫైనల్ కు చేరుకుంది. కాగా, మ్యాచ్ లో సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ బౌలర్లు కట్టడి చేశారు. క్వింటన్ డికాక్ (13), బవుమా (20), మార్కరమ్ (17) క్లాసెన్ (21), మిల్లర్ (17) కట్టకట్టుకుని విఫలమయ్యారు. గాయం బారినపడి కేశవ్ మహరాజ్ ఒంటి కాలితో కుంటుతూ (13) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.
పాకిస్థాన్ కు భలే చాన్స్
నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి పాకిస్థాన్ నెత్తిన పాలుపోసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆ జట్టు గెలిస్తే చాలు.. సెమీస్ కు వెళ్లిపోతుంది. ఒకవేళ బంగ్లాదేశ్ గెలిస్తే ఆ జట్టు సెమీఫైనల్ కు చేరుతుంది. క్రికెట్ అంటేనే అనిశ్చితి.. అందులోనూ టి20 క్రికెట్..? అసలు సెమీస్ ఆశలే లేని స్థితి నుంచి ఈ రెండు జట్లూ క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్ లో తలపడడం అనిశ్చితికి ప్రత్యక్ష నిదర్శనం. కాగా, ఈ రెండు జట్ల మ్యాచ్ లో విజేత.. సెమీస్ లో గ్రూప్ 1 టాపర్ న్యూజిలాండ్ ను ఢీకొంటుంది. భారత్ ఇంగ్లండ్ తో తలపడుతుంది.