క్షణం తీరిక లేని కాలమిదీ.. ఎన్నో సమస్యలతో దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం మూలంగా విహారయాత్రకు వెళ్లి చాలా మంది జంటలు సేద తీరుతుంటారు. అలా వెళ్లినవారు ఓ హోటల్ గదిని తీసుకొని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఒక అడుగు ముందుకేసి శృంగార జీవితం కోసం ఆరాటపడుతారు. హోటల్ గదిని అద్దెకు తీసుకున్న తరువాత ప్రపంచంతో సంబంధం లేకుండా ఆనందక్షణాలను అనుభవిస్తారు...
అయితే ఇకపై వీరు అజాగ్రత్తగా ఉంటే ఎంత అనర్థమో ఓ ఘటన ఎత్తి చూపింది.. గది తలుపులు వేసిన తరువాత తమనెవరు చూడరనుకునుకుంటే పొరపాటే. మనకు తెలియకుండా మన గదిలోనే కెమెరాలను పెట్టి ప్రపంచానికి చూపిస్తున్నారు కొందరు. లైవ్ శృంగార వీడియోల పేరిట ఆన్ లైన్ లో చూపిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఈ తంతు వెనుక పెద్ద ముఠానే ఉంది.
దక్షిణ కొరియాలోని పది నగరాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. తక్కువ ధరకే గదులు అద్దెకు ఇచ్చే 30 హోటళ్లలో విహార యాత్రికులు ఎక్కువగా దిగుతున్నారు. ఇందులో ప్రశాంత జీవితాన్ని గడిపేందుకు గదులు అద్దెకు తీసుకుంటున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న కొందరు ఎవరికీ తెలియకుండా టీవీకవర్ కు - గోడలకు కెమెరాలను అమర్చుతున్నారు. వారికి తెలియకుండా వారి వీడియోలను ఆన్ లైన్ లో పెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా 800 జంటలు ప్రైవసీగా ఉన్న వీడియోలను ఆన్ లైన్ లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ దందా సాగిస్తున్న ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ వీక్షకుల నుంచి భారీగా డబ్బులు సంపాదించింది. అలాగే కెమెరాలను అమర్చిన వారికీ భారీగానే ముడుపులు అందించింది. ఇదిలా ఉండగా కుటుంబ సభ్యులు - యువతీ యువకులు తమ వీడియోలు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు తెలవడంతో ఆవేదన చెందుతున్నారు. కొందరి ఫిర్యాదుతో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. హోటల్ గదిలో కెమెరాలు అమర్చడం కొత్తేమీ కాదని చెబుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో వీడియోలో పెట్టడం ఇదే మొదటిసారి చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇలా హోటళ్లలో కెమెరాలు అమర్చి ఆన్ లైన్ లో చూపించే ముఠా ఉందని, ఆ ముఠాను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కానీ ఇది బయటపడ్డాక ఇప్పుడు హోటళ్లలో దిగేవారు మాత్రం జాగ్రత్తగా లేకపోతే అనర్థం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.