'నాటు నాటు'కి స్టెప్పులేసిన సౌత్ కొరియా ఎంబ‌సీ!

Update: 2023-02-26 21:14 GMT
'నాటు నాటు' సాంగ్ ప్ర‌పంచ దేశాల్ని  కుదిపేస్తోన్న పాట‌. ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కి పోటీ ప‌టంతో 'నాటు నాటు' ఇప్పుడంత‌టా మార్మొగిపోతుంది. ఇక అంత‌కు ముందే ఈ పాట సోష‌ల్ మీడియాలో ఏ రేంజ్ లో పాపుల‌ర్ అయిందే తెలిసిందే. ఈ పాట‌కి స్టెప్ వేయ‌ని అభిమాని లేడు. విదేశీయు లు సైతం రీల్స్ చేసి నాటు నాటుపై అభిమానాన్ని చాటుకున్నారు.

తాజాగా ఇదే పాట‌పై  దక్షిణ కొరియా ఎంబసీ సిబ్బంది డ్యాన్స్ చేసిన వీడియో  నెట్టింట‌ వైరల్‌గా మారింది. భారత కొరియన్ ఎంబసీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి  ఈ వీడియో పోస్ట్   అయింది.  

'మీకు నాటు తెలుసా? ఎంబసీ సిబ్బంది 'నాటు నాటు'తో పాటు కొరియన్ రాయబారి చాంగ్ జే-బోక్‌ని మీతో పంచుకోవడా నికి మేము సంతోషిస్తున్నామని రాసుకొచ్చారు.

ఈ వీడియోకి ట్విట్టర్‌లో ఇప్పటివరకు 500000 వీక్షణలు.. 20000 లైక్‌లు ..4000 రీట్వీట్‌లు వచ్చాయి.  ఈ వీడియో చూసి భార‌త‌  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రశంసించారు. 'నాటు నాటు' ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ -క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది.  ఇంకా హెచ్ సీఏ  ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ..  ఉత్తమ యాక్షన్ చిత్రంతో సహా నాలుగు ట్రోఫీలను అందుకుంది.

మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఆరోజు భార‌తీయులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్  చిత్ర బృందం ఆస్కార్ అవార్డుతో సొంత గ‌డ్డ‌పై అడుగు పెడుతుంద‌ని కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈసినిమాతో రాజ‌మౌళి  ఖ్యాతి  మ‌రోసారి విశ్వవ్యాప్త‌మైంది.

ఇండియ‌న్ స్పీల్ బ‌ర్గ్ గా  కొనియాడుతున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం కీర‌వాణి సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. డి.వి.వి దాన‌య్య చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News