ఉత్తర పద్రేశ్ లో ఎస్పీ-బీఎస్పీల పొత్తు అంశంపై మాయావతి స్పందించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎస్సీ-బీఎస్పీలు మహాఘట్ బంధన్ అంటూ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలు ఆ పొత్తును ఆమోదించలేదు. వారు దాన్ని తిరస్కరించారు. ఎస్పీ-బీఎస్పీలను జాయింటుగా ఓడించారు. బీజేపీని బ్రహ్మాండంగా గెలిచారు.
ఎస్పీ - బీఎస్పీలకు సొంతంగా భారీ ఓటు బ్యాంకు ఉంది. ఆ రెండు పార్టీలూ చేతులు కలిపిన నేపథ్యంలో .. బీజేపీకి భంగపాటు తప్పదని అంతా అనుకున్నారు. అయితే ఆ రెండు పార్టీల పొత్తు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. పొత్తుతో వెళ్లి ఆ రెండు పార్టీలూ నష్టపోయాయి తప్ప - జాయింటుగా లాభపడలేదు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాయవతికి ఆ విషయం అర్థం అయ్యింది. దీంతో ఆమె ఇక పొత్తు ఉండదని ప్రకటించారు. అంతే కాదు.. ఇప్పుడు మరో విషయాన్ని ఆమె చెప్పారు.
ఎస్పీ-బీఎస్పీలు పొత్తు పెట్టుకున్నా దళితులు ఎస్పీ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయలేదని ఆమె ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు చేస్తున్న వాదనను ఆమె ఒప్పుకున్నారు. దళితులు ఎస్పీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆమె తేల్చారు. గతంలో అధికారం చేతిలో ఉన్నప్పుడు అఖిలేష్ యాదవ్ యూపీలో దళితులను అన్ని రకాలుగానూ అణగదొక్కేందుకు ప్రయత్నించారని, దళితులు ఏం చేసినా అఖిలేష్ వ్యతిరేకించారని.. వారంతా బీఎస్పీకి అండగా ఉంటారని అఖిలేష్ అలా వ్యవహరించారని.. దీంతో దళితుల ఓట్లు ఎస్పీ అభ్యర్థులకు పడి ఉండకపోవచ్చని మాయా అన్నారు.
అయితే బీఎస్పీ నెగ్గిన నియోజకవర్గాల్లో కేవలం ఎస్పీ సహకారం వల్ల మాత్రమే గెలిచారనే వాదనను మాత్రం ఆమె ఖండించారు!