పట్టరాని ఆనందం మిగిల్చిన విషాదం!

Update: 2016-12-30 11:46 GMT
భరించలేనంత బాధ వచ్చినా, పట్టరానంతగా సంతోషం వచ్చినా కూడా తట్టుకోవడం చాలా మందికి చాలా కష్టం. అందుకే కాస్త వీక్ హార్ట్ ఉన్నవారికి, హుండేజబ్బులు, బీపీ ఉన్నవారికి ఏ విషయం అయినా చెప్పేముందు విడతలవారీగా చెప్పాలని అంటుంటారు. ఒకేసారిగా శుభవార్త కానీ, అశుభవార్త కానీ చెబితే అన్ని గుండేలూ తట్టుకోలేవు!! దానికి తాజా ఉదాహరణ యూపీలో చోటుచేసుకుంది.

వివరాళ్లోకి వస్తే... రెండురోజుల క్రిందట ఉత్తరప్రదేశ్ కు చెందిన చండ్రసేన్ తప్లుకు ఒక శుభవార్త తెలిసింది. అదికూడా పట్టరాని సంతోషాన్ని తెచ్చిన అదృష్టానికి సంబందించి. అది మరేమిటో కాదు... యూపీ ఎన్నికల్లో టికెట్ వచ్చింది. అవును.. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు సంబందించిన అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా ఆగ్రా కంట్ స్థానానికి చండ్రసేన్ తప్లు అనే నేతకు టికెట్ ఇచ్చారు. దీంతో ములాయాంకు ధన్యవాదాలు చెప్పిన ఆయన పట్టరాని సంతోషంతో సంబరాల్లో మునిగిపోయారు. అడిగినవారికి అడగనివారికి కూడా తన సంతోషాన్ని చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఆ అదృష్టం మాటున ప్రమాధం మాటువేసి ఉంది.

టికెట్ వచ్చిందన్న సంబురాల్లో ఉన్న చండ్రసేన్ కు ఉన్నట్లుండి ఛాతిప్రాంతంలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అనంతరం అక్కడినుంచి గుర్గావ్ మేదాంత ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దాంతో అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుండగా మార్గమధ్యలో మధుర టోల్ ప్లాజా వద్ద ప్రాణాలు కోల్పోయారు. పట్టరాని సంతోషం హార్ట్ అటాక్ కు దారితీసిందని కుటుంబ సభ్యులు - బందువులు - అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషయంపై ములాయం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News