అజంఖాన్.. దేశంలోనే అత్యంత వివాదాస్పద రాజకీయ నేత, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ.. మన రాంగోపాల్ వర్మ సినిమాల్లో ఎంత కాంట్రావర్సీనో..రాజకీయాల్లో ఉత్దరప్రదేశ్ లోని రాంపూర్ ఎంపీ అజంఖాన్ కూడా అంతే వివాదాస్పద నేత. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఈయన బీజేపీ నుంచి పోటీచేసిన ప్రముఖ నటి జయప్రదను ఇదే రాంపూర్ లో ఓడించి సమాజ్ వాదీ నుంచి గెలిచి పార్లమెంట్ గడప తొక్కాడు.
అయితే జయప్రదపై ప్రచారం సదర్భంగా అజంఖాన్ దారుణమైన లైంగిక ఆరోపణలు చేసి అవమానించారు. ఇక కేంద్రంలోని బీజేపీని - మోడీషాలను కూడా తూర్పారపట్టారు. తీవ్రమైన పదజాలంతో నోరుజారాడు. అయితే మోడీషాలు ఊరుకుంటారా? అజంఖాన్ పనిపట్టారు. ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కారు ఇప్పుడు అజంఖాన్ ను వెంటాడుతోంది. ఇప్పటికే ప్రభుత్వ భూములు కాజేశాడని.. పేద రైతుల వ్యవసాయ భూములు కొల్లగొట్టాడని.. బర్రె - మేక కూడా దొంగతనం చేశాడని సమాజ్ వాదీ ఎంపీ అజంఖాన్ పై మొత్తం 80కు పైగా కేసులను యూపీ ప్రభుత్వం మోపింది.
ఇక అజంఖాన్ కు చెందిన జౌహా యూనివర్సిటీకి విదేశీ విరాళాలు రావడంపై మనీ లాండరింగ్ కేసులను కూడా ఈడీ మోపింది. దీంతోపాటు అజంఖాన్ ను రాంపూర్ లో అడుగు పెట్టకుండా 144 సెక్షన్ విధించింది.
తాజాగా అజంఖాన్ పై కక్షగట్టిన యూపీ సర్కారు చర్యకు వ్యతిరేకంగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాంపూర్ లో పర్యటించారు. అజంఖాన్ ను వెంటబెట్టుకొని వచ్చిన అఖిలేష్ ను ఆ పార్టీ కార్యకర్తలు - నేతలు కలువనీయకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అఖిలేష్ - అజంఖాన్ ను కలవడం కోసం ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఏకంగా కార్యకర్తలతో కలిసి పెళ్లి కుమారుడి వేషంలో రావడం విశేషం. ఈ ఫొటోలు - వీడియోలు వైరల్ అయ్యాయి. సమాజ్ వాదీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి యూపీ సర్కారు వేధిస్తోందని.. ప్రజలు రాంపూర్ లో అజంఖాన్ ను గెలిపించినా ప్రభుత్వం మాత్రం అణిచివేస్తోందని సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. యూపీలోని యోగీ సర్కారుపై మండిపడ్డారు.