ప్రవాసుల కోసం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్య నగరం.. చెత్త నగరం ఏదీ?

Update: 2022-12-01 08:21 GMT
ఇతర దేశస్తుల స్వర్గధామం ఇన్నాళ్లు అమెరికా అనుకుంటాం. అగ్రరాజ్యంలో జీవించాలని అందరూ కోరుకుంటారని భావిస్తాం. కానీ ప్రవాసులు నివసించడానికి.. పనిచేయడానికి అత్యంత అనువైన నగరాల జాబితాలో అమెరికాయేతర నగరం చోటు సంపాదించింది. ఈ జాబితాలో స్పెయిన్ లోని వాలెన్సియా అగ్రస్తానంలో నిలిచింది.  ఈ కొత్త సర్వే ప్రకారం తొలి మూడు నగరాలు  మూడు వేర్వేరు ఖండాల్లోనివి కావడం విశేషం.  మూడు వేర్వేరు నగరాలు ప్రవాసులు నివసించడానికి.. పని చేయడానికి ఉత్తమ నగరాలుగా గుర్తించబడ్డాయి.

స్పెయిన్ లోని 'వాలెన్సియా' నగరం 'ఇంటర్నేషన్స్ ఎక్స్‌పాట్ సిటీ ర్యాంకింగ్ లిస్ట్ 2022'లో అగ్రస్థానంలో ఉంది. జీవన నాణ్యత, ప్రజా రవాణా, క్రీడా అవకాశాల్లో ఈ నగరం ముందంజలో ఉంది. దీనితర్వాత దుబాయ్ తర్వాతి స్థానంలో ఉంది. ఇది కొత్త వారిని ఆకర్షించడంలో ప్రశంసలు అందుకుంది. అందుబాటు ధరలో మెక్సికో సిటీ మూడో స్థానంలో నిలిచింది.

దక్షిణాఫ్రికా రాజధాని జోహన్నెస్‌బర్గ్  టాప్ 50 నగరాల జాబితాలో దిగువ స్థానంలో ఉంది. సర్వేలో పాల్గొన్న వారు దక్షిణాఫ్రికా నగరాన్ని భరించలేని.. సురక్షితం కాదని బ్రాండింగ్ చేశారు. కింది నుంచి రెండో స్థానంలో జర్మనీ లోని ఫ్రాంక్‌ఫర్ట్ మరియు ఫ్రెంచ్ రాజధాని పారిస్ ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో నివాసాలు అందుబాటు ధరలో లేవని పేర్కొన్నారు.  

ఉత్తర అమెరికాలోని మయామి 12వ స్థానంలో ఉంది.  న్యూయార్క్ 16వ స్థానంలో , టొరంటో 19వ స్థానంలో ఉంది. యూకేలోని లండన్ 40వ స్థానంలో వెనుకబడింది.

ఆసియాలోని ఇతర ప్రాంతాలలో బ్యాంకాక్ తక్కువ జీవన వ్యయంతో ఆరవ స్థానంలో నిలిచింది. మెల్బోర్న్ యొక్క పని-జీవిత సమతుల్యత ఎనిమిదో స్థానాన్ని సంపాదించింది. సింగపూర్ మొదటి 10వ స్థానంలో నిలిచింది.

181 దేశాలల్లోని 11,970 మంది ప్రవాసుల నుండి ఇంటర్నేషన్స్ సమాచారాన్ని సేకరించింది. యాభై నగరాలు ప్రతి గమ్యస్థానానికి కనీసం 50 మంది పాల్గొనే నమూనా పరిమాణ అవసరాన్ని తీర్చాయి.  ప్రతి నగరం యొక్క ప్రధాన పోలింగ్ ఫీచర్‌ల గురించి ఇంటర్నేషన్స్ వివరించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News