దేశమంతా దూసుకుపోతున్నామని చెబుతున్న బీజేపీ తాము అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్ లోనే భయంతో బిక్కచచ్చిపోతోంది. కేంద్రంలో - రాష్ట్రంలో అధికారం తమదే అయినా పార్టీలో కొనసాగడానికి భయపడుతున్నారు నేతలు. మావోయిస్టుల భయంతో ఛత్తీస్ గఢ్ లో బీజేపీ నేతలు రాజీనామాలు చేస్తుండడంతో ఆ పార్టీ అధిష్ఠానం కంగారుపడుతోంది. భయపడొద్దంటూ ఎంతగా ధైర్యం నూరిపోస్తున్నా నేతలు ఒక్కరొక్కరుగా రాజీనామాలు సమర్పిస్తుంటే ఏం చేయాలో తోచక తల్లడిల్లుతోంది. ఒక్క బస్తర్ జిల్లాలోనే ఇప్పటికి 28 మంది ముఖ్య నేతలు 100 మందికిపైగా చోటామోటా నేతలు రాజీనామాలు చేయడంతో ఇదెక్కడికి దారి తీస్తుందో అని ఆందోళన చెందుతోంది.
ఛత్తీస్ గఢ్ లోని దండకారణ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. దాడులు చేసి వరుసగా బిజెపి నేతలను హత్య చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో కలకలం మొదలైంది. అధికార పార్టీ నేతలంతా పార్టీకి రాజీనామా చేయాలనే మావోయిస్టుల డిమాండ్ మేరకు దండకారణ్యంలోని బస్తర్ ప్రాంతంలో బిజెపి నాయకులు రాజీనామాల పర్వానికి తెర లేపారు. సామూహికంగా రాజీనామాలు చేస్తుండటంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిజెపి అధిష్టానం కలవరపాటుకు గురవుతోంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ 3వ దశను నిలిపివేయాలని - గగనతలం నుంచి మావోయిస్టులపై దాడులను మానుకోవాలని, కేంద్ర బలగాలను దండకారణ్యం నుంచి ఉపసంహరించుకోవాలని మావోయిస్టు పార్టీ గత కొంత కాలంగా డిమాండ్ చేస్తోంది. పార్టీ కేడర్ ను కోల్పోతున్న మావోయిస్టులు బిజెపి నేతలపై దాడులకు తెగబడుతున్నారు. గత మూడు నెలల్లో ముగ్గురు బిజెపికి చెందిన ముఖ్య నేతలను మావోయిస్టులు హత్య చేశారు.
బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం.. హతమార్చడంతో పాటు బీజేపీలో ఉంటే చావు తప్పదని హెచ్చరిస్తుండడంతో నేతలు రాజీనామాలు చేస్తున్నారు. బస్తర్ లో ఇప్పటి వరకు 28 మంది ముఖ్య నేతలు మావోయిస్టుల ఒత్తిడి కారణంగా పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి దూరంగా ఉండి ప్రాణాలు కాపాడుకోవాలని వారంతా అనుకుంటున్నారు. ఇలా వందల సంఖ్య నేతలు - క్యాడర్ పార్టీకి దూరమైతే ఇబ్బందన్న సంగతి గుర్తించిన అధిష్ఠానం ఇప్పటికే ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ తో చర్చించింది. ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని ఆయన సూచనలను కోరినట్లు సమాచారం.