ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. స్పీకర్ తమ్మినేని కాన్వాయ్ లోకి దూసుకొచ్చిన ఓ ఆటో బీభత్సం సృష్టించింది. ఆటోను తప్పించబోయిన స్పీకర్ కారు పొలాల్లోకి దూసుకెళ్లింది.
సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తర్వాత తిరుగు ప్రయాణమైన స్పీకర్ కాన్వాయ్ లో ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వాకలవలస, వంజంగి గ్రామాల గుండా స్పీకర్ తమ్మినేని కాన్వాయ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
కాన్వాయ్ వెళుతుండగా ఓ ఆటో అందులోకి చొరబడింది. ఆ ఆటోను తప్పించబోయిన స్పీకర్ వాహనం పొలాల్లోకి దూసుకెళ్లింది. కారును ఢీకొని బోల్తాపడిన ఆటోలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కారులోంచి దిగిన స్పీకర్ గాయపడిన వారిని దగ్గురుండి శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యామ్మాయ వాహనంలో స్పీకర్ తమ్మినేని తన ఇంటికి వెళ్లిపోయారు.