ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని వ్యవహారం అంతటా చర్చనీయమవుతోంది. గౌరవ ప్రదమైన పదవిలో ఉంటూ ఆయన కాస్త నోటిని ఫ్రీగా వదిలేస్తున్నారన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆయన చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఇదేమైనా ‘ఖవ్వాలీ డ్యాన్సా’ అనడంతో అసెంబ్లీలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టగా రేపు చర్చిద్ధామని స్పీకర్ తమ్మినేని అన్నారు. చర్చించాల్సిందేనని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అడిగినప్పుడల్లా అవకాశం ఇవ్వడానికి ఇదేమైనా ఖవ్వాలీ డ్యాన్సా అని స్పీకర్ అన్నారు. దీంతో చంద్రబాబు కూడా తన నోటికి పనిచెప్పారు. ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదని చంద్రబాబు అన్నారు. దాంతో స్పీకర్ స్థానానికి చంద్రబాబు గౌరవడం ఇవ్వడం లేదని స్పీకర్ అన్నారు. చంద్రబాబు స్పీకర్ కు గౌరవం ఇవ్వడం లేదని, సభ స్థానంలో ఎవరున్నా గౌరవించాలన్నారు. ఇంత సీనియారిటీ ఉండి ఏం లాభమని స్పీకర్ తమ్మినేని అన్నారు.
కాగా తమ్మినేని స్పీకరు అయిన తరువాత సభ వెలుపల ఆయన మాటతీరు ఇప్పటికే పలుమార్లు విమర్శలకు గురైంది. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై బూతులు ప్రయోగించారు ఓసారి. మరోసారి సొంత జిల్లా శ్రీకాకుళంలో ప్రభుత్వోద్యోగులపై ఆయన తన జోరు చూపించారు. తంతానంటూ వారిని హెచ్చరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా ప్రొటోకాల్ పాటించలేదని సాకుతో అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు మరోసారి ఇలాంటి తప్పులు జరిగితే స్పాట్ లోనే తంతానని హెచ్చరికలు చేయటం వివాదానికి దారి తీసింది.