సంకీర్ణ సర్కారుపై కోపంతో రాజీనామాలు ఇచ్చిన ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించే అవకాశాలు కనిపించడం లేదు! మొత్తం పద్నాలుగు మంది వరకూ రాజీనామా చేసినట్టుగా ఉన్నారు. వారిలో కొందరు మాత్రమే డైరెక్టుగా స్పీకర్ ను కలిసి రాజీనామాను ఇచ్చారట. మిగతా వాళ్లు పోస్టల్ ద్వారా పంపించారట.
అలాంటి రాజీనామాలను యాక్సెప్ట్ చేసేది లేదని స్పీకర్ రమేశ్ కుమార్ తేల్చి చెప్పారు. ఇక మిగతా రాజీనామాలను కూడా ఆయన ఆమోదించే అవకాశాలు కనిపించడం లేదు.
ఎంతైనా స్పీకర్ కాంగ్రెస్ వ్యక్తి. అక్కడి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికే ఆయన ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి.. ఆయన ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించే అవకాశాలు లేవు. స్పీకర్ ముందుకు ఎమ్మెల్యేలు వెళ్లి పట్టుబడితే తప్ప ఆమోదించే అవకాశాలు లేవు. అప్పటికీ లేట్ చేయొచ్చు!
స్పీకర్ తమ వాడు కాబట్టి కాంగ్రెస్ –జేడీఎస్ సేఫ్ జోన్ లో ఉన్నాయని అనడానికి వీల్లేదు. అవతల గవర్నర్ ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాల రచ్చ నేపథ్యంలో బీజేపీ అవిశ్వాస తీర్మానానికి రెడీ అయ్యే అవకాశాలున్నాయి.
కుమారస్వామి ప్రభుత్వానికి ఎమ్మెల్యేల మద్దతు లేదని.. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు వస్తే కథ మరోలా ఉండే అవకాశం ఉంది. అప్పుడు గవర్నర్ నిర్ణయం కీలకం అవుతుంది. గవర్నర్ కమలం పార్టీకి చెందిన వ్యక్తి.
ఇలా కర్ణాటక రాజకీయ పరిణామాలు స్పీకర్ - గవర్నర్ చేతిలో ఉండబోతున్నాయని స్పష్టం అవుతోంది.