రాష్ట్ర బీజేపీ సారథి సోము వీర్రాజుకు కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి ఒక సమాచారం వచ్చిందట. అది కూడా ఆయనకు మాత్రమే స్పెషల్ అని తేల్చడంతో ఇప్పుడు ఈ విషయం పార్టీ నేతల మధ్య ఆసక్తికర చర్చగా మారింది. విషయంలోకి వెళ్తే.. బీజేపీ నాయకులు.. తరచుగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తున్నారు. కొందరు వీరిలో పాత నేతలు.. కొత్త నేతలు కూడా ఉన్నారు. అయితే.. ఎవరు ఏం మాట్లాడినా.. చెల్లుతుందనే ధోరణితో కొందరు నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అంటే.. అసలు సంబంధం లేదని అంశాలపైనా.. లేదా.. మీడియాలో ప్రముఖంగా కనిపిస్తామనే అంశాలపైనా.. వారు గళం వినిపిస్తున్నాయి. దీనిపై కొన్ని రోజులుగా సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు.. తరచుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి.. సంచలనాలకు వేదికగా మారుతున్న నేతలను కూడా ఆయన హెచ్చరించారు. అదే సమయంలో మీడియా నిర్వహించే చర్చల్లోనూ.. కొందరు నేతలు పాల్గొని.. ప్రభుత్వానికి అనుకూలంగానో.. వ్యతిరేకంగానో మాట్లాడుతున్నారు. అంతేకాదు.. ఈ క్రమంలోవారు బీజేపీని హైలెట్ చేయడం లేదనేది ప్రధాన విమర్శ. ఈ క్రమంలో సోము వీర్రాజు.. రాష్ట్ర పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
అంతేకాదు.. తనను ధిక్కరించిన వారిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఇది కొన్నాళ్లు తీవ్ర వివాదంగా మారింది. దీంతో తమకు అనుకూలంగా ఉన్న కేంద్రంలోని పెద్దలతో వీరు రాయబారం నెరిపారు. మేం పార్టీ కోసం పనిచేస్తున్నాం.. మీడియాతో మాట్లాడితే.. తప్పేంటని వారు ప్రశ్నించారు. ఈ విషయంలో సోము వీర్రాజు చర్యలు తీసుకోకుండా చూడాలని వారు అభ్యర్థించారు. ఇదే విషయంపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా దృష్టి పెట్టారు. ఎవరెవరుమీడియాతో మాట్లాడుతున్నారు..? ఎవరు చర్చలకు వెళ్తున్నారు? అనే విషయాలపై ఆరా తీశారు.
ఈ క్రమంలో సోము ఇచ్చిన నివేదిక.. సదరు నేతలు చేసిన అభ్యంతరాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే సోముకు అనుకూలంగా కేంద్రం నుంచి సమాచారం అందింది. సొము వీర్రాజు ఈతీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని.. మీడియాతో ఎవరు మాట్లాడాలన్నా.. సోము నుంచి అనుమతి తీసుకోవాలని.. సూచించారట. దీంతో ఇప్పుడు సోముకు మాత్రమే.. మీడియాతో మాట్లాడే అవకాశం వచ్చిందని.. ఇది ఆయనకు మాత్రమే స్పెషల్ అని.. చెవులు కొరుక్కొంటున్నారు.