ఎన్ని చెప్పినా.. ఎంతలా మొత్తుకున్నా సరే.. తమ పని తమదే అన్నట్లుగా వ్యవహరించేటోళ్లు కొందరు ఉంటారు. ఇలాంటోళ్లు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉంటారు. అభివృద్ధి చెందిన అమెరికా.. బ్రిటన్ లాంటి దేశాల్లోనూ కొందరు అమర్యాదస్తులు ఉంటారు.
వారు చట్టాల్ని.. నిబంధనల్ని పట్టించుకోకుండా తమ పని తాము చేస్తూ.. తలనొప్ల్ని తెచ్చి పెడుతుంటారు. అలాంటి అమర్యాదస్తులకు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు లండన్ లోని అధికారులు.
బహిరంగ మూత్రవిసర్జన చేసే వారికి దిమ్మ తిరిగేలా షాకిస్తూ అక్కడి అధికారులు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. సరికొత్త రసాయనంతో బహిరంగ స్థలాల్లోని గోడలకు రంగులు వేస్తున్నారు.
దీని వల్ల ప్రయోజనం ఏమంటే.. మూత్ర విసర్జన చేసేందుకు సదరు గోడ మీద చేసిన మరుక్షణం.. అవి కాస్తా బూమ్ రాంగ్ అయి.. మూత్రవిసర్జన చేసిన వ్యక్తి మీదే పడేలా చేశారు. దీంతో.. నిబంధనలకు విరుద్ధంగా మూత్ర విసర్జన చేస్తే.. వారికి భారీ షాక్ తగిలేలా చేశారు.
దీంతో.. బార్లు.. రెస్టారెంట్లు.. వినోద ప్రదేశాలతో పాటు సందర్శనీయ స్థలాల వద్ద ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి చెక్ పెట్టినట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. లండన్ లోని 12 సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ స్పెషల్ స్ప్రే ఆన్ లిక్విడ్ ను వేశారు. గోడల ఉపరితలానికి ఈ పెయింట్ లాంటి మిశ్రమాన్ని వేసిన తర్వాత మూత్రం పోస్తే.. ఆ వెంటనే వెనక్కి చిమ్ముతుంది. దీంతో.. మూత్రం పోసే వారి మీదే పడుతుంది.
ఈ లిక్విడ్ చాలా బాగా పని చేస్తుందని.. అదెలా పని చేస్తుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు నీళ్లను పోయటం ద్వారా పరీక్షించి చూశారు. ఈ టెక్నాలజీ ఏదో.. దేశంలోని ప్రముఖ దర్శనీయ స్థలాల్లోని గోడల మీద పెయింట్ చేయిస్తే.. మన దగ్గర బహిరంగ మూత్ర విసర్జనకు చెక్ పెట్టే వీలుందన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.