కేంద్రంలో రాజకీయ సమీకరణాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా మారేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. క్రితం టర్మ్ లో కేంద్రంలో మోడీ సర్కారు వచ్చినా, ప్రత్యేకహోదాను ఎన్నికల హామీలో పేర్కొన్న బీజేపీ అధికారాన్ని సాధించుకున్నా ఏపీ విషయంలో అది మాట నిలబెట్టుకోలేదు. ఇచ్చిన హామీని అమలు చేయలేదు.
కేంద్రంలో అప్పుడు టీడీపీ అధికారంలో భాగస్వామి అయ్యింది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నా, ఆ రెండు పార్టీలూ దోస్తులుగా చలామణి అయినా రాష్ట్రానికి మాత్రం మేలు చేయలేదు. నాలుగున్నరేళ్ల పాటు అవి అదికారాన్ని అనుభవించాయి.
రాష్ట్రానికి మేలు చేయడానికి బదులు మరింత మోసం చేశాయి ఇరు పార్టీలూ. ఏపీకి ప్రత్యేకహోదా వద్దని చంద్రబాబు నాయుడు ప్రజల మీదే ఎదురుదాడి చేశారు. కేంద్రం ఏపీకి బ్రహ్మాండంగా న్యాయం చేస్తోందంటూ బాబు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం పెట్టాడు. తీరా.. ఎన్నికలు వచ్చే సమయానికి మాత్రం బాబు మాట మార్చిన సంగతి తెలిసిందే!
గత ఐదేళ్లు అలా గడిచిపోయినా.. ఈ సారి కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం మాత్రం తప్పకుండా ఏపీకి సానుకూలంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గట్టిగా పట్టుకున్నారు. వైఎస్సార్సీపీకి ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కేంద్రంలో వైఎస్సార్సీపీ మద్దతు కీలకం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ పరిణామాల మధ్యన జగన్ మద్దతు తో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఏపీకి హోదా ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల హామీలో ప్రత్యేకహోదా అంశాన్ని పెట్టింది. జగన్ గనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఆ పార్టీ మాట నిలబెట్టుకోవాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. బీజేపీ వాళ్లకు జగన్ మద్దతు కావాలనుకుంటే ఆయన షరతుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఏతావాతా ఏపీకి ఈ సారి ప్రత్యేకహోదా దక్కడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.