ఏపీ రాజకీయాల్లో నిత్యం కలగజేసుకునే, ప్రత్యేక హోదా కోసం సీరియస్ గా కనిపించే తెలుగు మాజీ హీరో శివాజీ ఇప్పుడు కూడా ప్రత్యేకహోదా చుట్టు అల్లుకున్న రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఇంతవరకు ఎవరూ చేయని డిమాండ్ చేశారాయన. ఏకంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం ఎలాంటి ఫలితం ఉండదని సినీ హీరో శివాజీ అభిప్రాయపడ్డారు. అదే పనిని ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్గంలో నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావడం సంతోషకర పరిణామమన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఎవరు తీసుకువస్తారు, ఎవరు హీరోలవుతారనే విషయాలను పక్కనపెడితే .. వెంకయ్య నాయుడు ఒక్కడు కనుక తన పదవికి రాజీనామా చేస్తే ఆరోజున ప్రత్యేకహోదా వస్తుందన్నారు.
రాజీనామా చేస్తే వెంకయ్య కంటే పెద్ద హీరో ఎవరూ ఉండరన్నారు. ఈ విషయం ఆయనకు ఎవరైనా చెప్పినా బాగానే ఉంటుంది. లేదా, రాష్ట్ర ప్రజలకు సహాయం చేసిన వాడిని అవుతానని ఆయన రియలైజ్ అయితే బాగుంటుందన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేయడం వల్ల ఏపీకి అన్యాయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ఇది బీజేపీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.