వైద్యులకు ప్రత్యేక వీసా.. ప్రధాని మోదీ..!

Update: 2021-02-19 05:30 GMT
ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. వైద్యులకు ప్రత్యేక వీసాలు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. గురువారం పది పొరుగుదేశాల ప్రతినిధులతో ‘కరోనా నిర్వహణ​- అనుభవాలు, మంచి పద్ధతులు, భవిష్యత్​ నిర్దేశం’ అనే  అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యులతోపాటు వైద్య సిబ్బంది, నర్సులకు కూడా ప్రత్యేక వీసాలు ఉండాలని.. సాధారణ వీసాల్లా కాకుండా వీళ్లకు త్వరితగతిన మంజూరయ్యే వ్యవస్థ ఉండాలని.. ఆ మేరకు నిబంధనలు సడలించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

డాక్టర్లు అత్యవసర పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లాల్సివస్తుంది కాబట్టి వాళ్లకు వీసాల జారీ విషయంలో సడలింపులు ఉండాలని ఆయన పేర్కొన్నారు.  ఈ మేరకు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, ప్రాంతియ ఎయిర్​ అంబులెన్స్​ ఒప్పందాన్ని సమన్వయం చేసుకోవచ్చన్నారు.  21 వ శతాబ్ధం​ ఆసియా శతాబ్దం  కావాలంటే దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ద్వీప దేశాల మైత్రి బలపడాలన్నారు.

ఆసియాలో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని ప్రధాని గుర్తుచేశారు. ఆరోగ్యరంగంలో సహకారం బాగుందని.. దీన్ని మరింతగా విస్తరించాలని చెప్పారు. కరోనా టీకాల సమర్థతను అధ్యయనం చేసే విషయంలోనూ సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు.  ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​తో ప్రధాని ఫోన్​లో సంభాషించారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉండాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
Tags:    

Similar News