గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బండిని నడపటం సాధ్యమా? అంటే.. ఇంచుమించు బుల్లెట్ ట్రైన్ తో పోటీ పడటమే. అత్యాధునిక కార్లు సైతం.. ప్రత్యేకంగా సిద్ధం చేసిన రేసింగ్ రోడ్ల మీద పరుగులు తీస్తుంటాయి. అలాంటిది. మామూలు ఎక్స్ ప్రెస్ హైవే మీద టూవీలర్ మీద దూసుకెళ్లటం అంటే.. ప్రాణాపాయానికి నూటికి రెండు వందల శాతం అవకాశం ఉంటుంది. అయినప్పటికీ అలాంటి వాటిని పట్టించుకోకుండా భారీ ప్రయోగానికి తెర తీసి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు యంగ్ తరంగ్.. స్పోర్ట్స్ బైక్స్ అంటూ ప్రాణంగా ఫీలయ్యే రేసింగ్ యూట్యూబర్ అగస్త్య చౌహాన్.
యుమున ఎక్స్ ప్రెస్ హైవే మీద తన తాజా కవాసాకీ నిన్జా బైక్ మీద ఆగ్రా - ఢిల్లీ మధ్య గంటకు 300కి.మీ. వేగంతో దౌడ్ తీసేందుకు సిద్ధమై.. ఆ క్రమంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవటం తెలిసిందే.
స్పోర్ట్స్ బైక్ గురించి తన యూట్యూబ్ చానెల్ ప్రొరైడర్ 1000 ద్వారా ఆసక్తికర విషయాలు చెబుతుంటాడు అగస్త్య. యూట్యూబ్ లోనూ.. సోషల్ మీడియాలోనూ అతగాడికి ఉన్న ఫాలోయింగ్ ఎంతన్న దానికి.. ఏదైనా కొత్త బైక్ విడుదలైనంతనే.. అతడి రివ్యూ కోసం వేలాది మంది ఎదురుచూస్తుంటారు.
గంటకు 300కిమీ వేగంతో బైక్ మీద దూసుకెళ్లేందుకు వీలుగా మే 3న అన్ని సిద్ధం చేసుకున్నాడు. బుల్లెట్ రైలు వేగంతో బైక్ నడపాలన్న ఉత్సాహంతో దూసుకెళ్లిన అగస్త్య బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టటంతో.. కింద పడిపోవటం.. ఆ వేగానికి అతను పెట్టుకున్న హెల్మెట్ ఊడిపోయి.. ముక్కలైపోవటం.. అతడి తల బలంగా రోడ్డును తాకటంతో అక్కడికక్కడే మరణించారు.
అతడి మరణవార్త దేశ వ్యాప్తంగా షాకింగ్ గా మారింది. ప్రమాద సమయంలో అతను ఎంత స్పీడ్ తో ఉన్నాడు? అన్న విషయాన్ని పోలీసులు చూడగా.. స్పీడో మీటర్ మీద 258 కిమీగా చూపిస్తోంది.
అంటే.. 300 లక్ష్యానికి దూసుకెళ్లే క్రమంలో అమితమైన వేగంతో దూసుకెళ్లిపోతున్న వేళ.. బండి అదుపు తప్పటంతో.. ఢీ కొని చనిపోయాడు. ఈ ప్రమాద ఘటన అలీగఢ్ జిల్లా తప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోస్టుమార్టం కోసం గ్రేటర్ నోయిడాలోని కైలాష్ ఆసుపత్రికి తరలించారు. ఏమైనా.. గంటకు 300కిమీ వేగంతో బైక్ మీద దూసుకెళ్లే క్రమంలో మరణించిన వైనం షాకింగ్ గా మారింది. ఏమైనా.. 258కి.మీ. వేగంతోదూసుకెళ్లటం అంటే.. బండి ఎంత వేగంగా వెళుతుందో ఊహించుకుంటేనే వణుకు పుట్టటం ఖాయం.