చందమామ పై స్పెర్మ్ బ్యాంక్... దేనికోసమంటే ?

Update: 2021-03-12 10:30 GMT
బ్యాంక్ .. మన దగ్గర ఉన్న దాన్ని దాచి పెట్టుకొని, అవసరం అయిన సమయంలో మళ్లీ బ్యాంక్ లో నుండి తీసుకోని వాడుకోవచ్చు. అయితే , మనీ బ్యాంక్ అయితే మనీ బ్యాంక్ లో డిపాజిట్ చేసుకొని అవసరానికి తగట్టు ఆ మనీని ఉపయోగిస్తుంటాం. ఇదే మాదిరి  మనిషిలోని వీర్యకణాలను కూడా భద్రపరిచేందుకు బ్యాంకు కూడా  ఉంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు వీర్యకణాలు, అండాలనూ బ్యాంక్‌ లో డిపాజిట్‌ చేసి అవసరం అయినప్పుడు వాటిని విత్‌ డ్రా చేసుకుని పిల్లల్ని కనే సదుపాయం ఇప్పటికే కొన్ని దేశాల్లో  అందుబాటులో ఉంది. ఈ సాంకేతికత భారత్ ‌లో కూడా ఈ మద్యే  అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ముప్పై ఏళ్ల తర్వాత మనిషిలో అండాల ఉత్పత్తి, వీర్యకణాలు ఉత్పత్తి బలంలగా ఉండవు  అందువల్ల సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుతాయి.

ఈ కారణంగా  యుక్త వయసులో స్త్రీ, పురుషుల్లో ఆరోగ్యకరమైన వీర్య కణాలు, అండాలు ఉంటాయి కాబట్టి, వాటిని తీసి భద్ర పరుచుకుంటూ ఉంటారు. సంతానలేమితో పాటు, జన్యుపరమైన ఇబ్బందులు పిల్లలకు రాకుండా ఈ పద్ధతి అనుసరిస్తూ ఉంటారు. అటువంటివారికి స్పెర్మ్ బ్యాంకులు ఉపయోగపడుతాయి. భూమి మీద అయితే ఇప్పటికే ఈ స్పెర్మ్ బ్యాంకులు ఉండగా సైంటిస్టులు స్పెర్మ్ బ్యాంకులను చంద్రునిపై కూడా ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఆధునిక గ్లోబల్ ఇన్సూరెన్స్ పాలసీ పేరుతో మనుషులతో సహా భూమి మీద ఉండే 6.7 మిలియన్ల జాతుల నుండి మానవులు పునరుత్పత్తి కణాలైన వీర్య కణాలు, అండాలను చంద్రునిపైకి తీసుకుని పోనున్నారు.

చంద్రుని ఉపరితలంపైనే ఈ బ్యాంకు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  మన గ్రహం ప్రకృతి వైపరీత్యాలు, కరువు, గ్రహశకలాలు మరియు అణు యుద్ధాలను ఎదుర్కొంటున్నప్పుడు.. ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వస్తొంది. ఆ సమయంలో మానవ జీవితాన్ని కాపాడటానికి మానవులు అంతరిక్ష యాత్రపై దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రునిపైకి జాతులను తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. భూమి సహజంగా అస్థిర వాతావరణం కలిగి ఉంటుంది. ఇప్పటికే భూమిపై అనేక జాతులు అంతరించి పోగా.. చంద్రునిపై అన్నీ జాతులను పెట్టడం మూలాన అవి అక్కడ వాతావరణ పరిస్థితుల్లో సహజంగా భద్రంగా ఉంటాయి. అస్థిరత కారణంగా, భూమిపై రిపోజిటరీ నమూనాలను హాని చేస్తుంది. అందుకని, వీలైనంత త్వరగా చంద్రునిపై మానవ విత్తన ఖజానాను స్థాపించడం ద్వారా జాతులను కాపాడుకోవచ్చు అనేది సైంటిస్టుల అభిప్రాయం. ఈ మిషన్ ఎంత “ఖర్చుతో కూడుకున్నది” అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి 6.7 మిలియన్ జాతులకు సంబంధించి 50 నమూనాలను రవాణా చేయడానికి 250 రాకెట్ ప్రయోగాలు చెయ్యవలసిన అవసరం ఉంది.
Tags:    

Similar News