టీడీపీకి షాక్‌ – ఎస్పీవై రెడ్డి రాజీనామా

Update: 2019-03-18 16:48 GMT
అందరూ ఊహించిందే అయ్యింది. నంద్యాల టిక్కెట్‌ని ఆశిస్తున్న ఎస్పీవైరెడ్డికి టీడీపీ షాక్‌ ఇచ్చింది. నంద్యాల అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాల్ని ఇవ్వలేమని చూచాయగా చెప్పేసింది. గత ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా వైసీపీ నుంచి గెలుపొందారు ఎస్పీవై రెడ్డి. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ, ఎంపీస్థానాల్ని ఆయన అడుగుతున్నారు. తనకు కాకపోయినా తన అల్లుడికి అయినా టిక్కెట్‌ ఇవ్వాలని ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఆల్‌రెడీ నంద్యాల ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నాడు. దీంతో సిట్టింగ్‌ వైపే మొగ్గుచూపారు. ఎమ్మెల్యే సీటు ఎటూ దక్కలేదు కనీసం ఎంపీగా అయినా పోటీకి అవకాశం ఇస్తారమోనని ఎస్పీవై రెడ్డి ఆలోచించారు. కానీ టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో.. టీడీపీకి రాజీనామా చేసేశారు.

రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు ఎస్పీవైరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధిష్టానం నమ్మించి మోసం చేసిందని మీడియా ముందు కంటతడి పెట్టారు పెద్దాయన. టీడీపీకి రాజీనామా చేశామని.. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా, తన అల్లుడు ఎమ్మెల్యేగా నంద్యాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. నంద్యాలలో తన సత్తా ఏంటో చూపిస్తామన్న ఎస్పీవైరెడ్డి... మాకు బ్లాక్‌ మెయిల్,లాబీయింగ్ చేయడం తెలీదు కాబట్టే సీట్లు రాలేదని అన్నారు. ఇన్నాళ్లు సీట్లు వస్తాయని ఆశించా కానీ రాలేదు.. ఇక రేపటినుంచి నంద్యాలలో ప్రచారం మొదలుపెడతాం అని ప్రకటించారు. ఇక ఆల్‌రెడీ నంద్యాలకు పోచ బ్రహ్మానందరెడ్డి పేరుని వైసీపీకి ఇప్పటికే ప్రకటించేంసింది. దీంతో.. పెద్దాయనకు అన్ని దారులు మూసుకుపోయాయి. అందుకే ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
Tags:    

Similar News