ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత భార్య భర్తల మధ్య సంబంధాలు మునుపటి అంత పటిష్టంగా లేకపోవడమే కాకుండా అనుమానాలు పెరిగిపోయేందుకు సైతం కారణంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య/భర్త ఎవరితో అయినా మాట్లాడుతున్నారా? ఇతరులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని తెలుసుకునేందుకు చాలా మంది వాళ్ల ఫోన్లను రహస్యంగా చెక్ చేస్తుంటారు. ఇది దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్ల ఉంది. అయితే సౌదీ అరేబియా సర్కారు ఇలాంటి పోకడలకు చెక్ పెట్టేందుకు కొత్త నిర్ణయం తీసుకుంది.
సౌదీ దేశ సాంస్కృతిక శాఖ జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం ఇక మీదట భార్య లేదా భర్త ఇకమీదట తమ భాగస్వామి ఫోన్‌ను రహస్యంగా చూస్తే భారీగా జరిమానా ఎదుర్కోవడంతో పాటు.. జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఈ మేరకు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. వ్యక్తుల నైతిక విలువను కాపాడేందుకు - వ్యక్తిగత సమాచార గోప్యతను పరిరక్షించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ శిక్ష మహిళలు - పురుషులకు సమానంగానే వర్తిస్తుందని వెల్లడించారు. యాంటీ సైబర్ క్రైమ్ లా పేరుతో ఈ ఆదేశాలను తీసుకొచ్చారు.
తాజా చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారు 1,33,000 అమెరికా డాలర్లు జరిమానా లేదా ఏడాది పాటు జైలు శిక్ష లేదా ఒక్కోసారి రెండు శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా ఇతరులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను రహస్యంగా తెలుసుకొని బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో వాటిని నియంత్రించేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, జీవిత భాగస్వాములు ఇతరులతో సంబంధాలు పెట్టుకున్నారని నిరూపించేందుకు - విడాకులు పొందేందుకు వాళ్ల ఫోన్లే ప్రధాన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని సౌదీలో జరిగిన విడాకుల గణాంకాలు వెల్లడించడం కొసమెరుపు.