బాబు పార్టీ తీర్థం పుచ్చుకున్న బాపు బొమ్మ

Update: 2019-01-01 10:44 GMT
దర్శకుడు స్వర్గీయ బాపు తెలుగులో ఎన్నో క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించారు.  అయన  సినిమాలో ఏ హీరోయిన్ నటించినా ఆ హీరోయిన్ ను తర్వాత బాపు బొమ్మ అని పిలిచేవారు.  కానీ 'అత్తారింటికి దారేది' సినిమా రిలీజ్ అయిన తర్వాత 'బాపు బొమ్మ' సాంగ్ హిట్ అయ్యే సరికి ఈమధ్య అందరూ ప్రణీతను బాపు బొమ్మ అని పిలవడం మొదలు పెట్టారు.  ఈ మోడరన్ బాపు బొమ్మను పక్కన బెడితే ఆ పాత బాపు బొమ్మలలో దివ్యవాణి ఒకరు.

'పెళ్లిపుస్తకం'(1991) సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు జోడీగా నటించిన దివ్యవాణి అప్పట్లో బాపు బొమ్మ.  90 లలో చాలా సినిమాలో నటించిన దివ్యవాణి తర్వాత నటనకు దూరమైంది.   చాలా రోజుల తర్వాత దివ్యవాణి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.  దివ్యవాణి తాజాగా ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ను కలిసి అయన సమక్షంలో టీడీపీ లో చేరింది.  నిజానికి దివ్యవాణి తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు మునుపే చంద్రబాబును కలిసిందట. కానీ ఆసమయంలో ఆమె పార్టీలో జాయిన్ అవుతుందని మాత్రం సమాచారం లేదు.

మరో ఆరు నెలల లోపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి కాబట్టి దివ్యవాణి టీడీపీ మహిళా విభాగంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి చంద్రబాబు దివ్యవాణి సేవలను పార్టీ కార్యక్రమాలకు ఎలా వినియోగించుకుంటారో వేచి చూడాలి. 
Tags:    

Similar News