విశాఖ ఎంపీ సీటు బాలయ్య చిన్నల్లుడిదే

Update: 2019-03-18 17:56 GMT
మొత్తానికి బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్‌ ఘటికుడే. తన పంతం నెగ్గించుకున్నాడు. విశాఖ ఎంపీ సీటుకి ఎంత పోటీ వచ్చినా సరే శ్రీభరత్‌ ఏమాత్రం భయపడలేదు. చంద్రబాబు తనకే ఇస్తారని కాన్ఫిడెంట్‌ గా ఉన్నాడు. దీంతో..ఎలా చూసినా భరత్‌ కంటే గట్టి క్యాండిడేట్‌ చంద్రబాబుకి కన్పించలేదు. ఇక ఫైనల్‌ గా భరత్‌నే విశాఖ ఎంపీగా ప్రకటించారు.

మొదట్లో విశాఖ ఎంపీ సీటుని గంటా శ్రీనివాసరావుకి ఇవ్వాలని అనుకున్నారు. కానీ బాలయ్య చిన్నల్లుడు ఎప్పటినుంచో విశాఖ ఎంపీగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కారణం.. తాత నుంచి వారసత్వంగా వచ్చింది కాబట్టి. కానీ ఇప్పటికే ఒకే కుటుంబం నుంచి చంద్రబాబు - బాలయ్య - లోకేష్ ముగ్గురు ఉన్నారు కాబట్టి శ్రీభరత్‌ కు ఇచ్చేందుకు చంద్రబాబు ఒప్పుకోలేదు. కావాలంటే రాజమండ్రి ఎంపీ సీటు ఇస్తాను పోటీ చేసుకో అని చెప్పారు. కానీ శ్రీ భరత్‌ ఒప్పుకోలేదు. తమకు విశాఖపట్నం కంచుకోట అని.. పోటీ చేస్తే విశాఖ నుంచే పోటీ చేస్తానని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. అంతేకాకుండా.. విశాఖ నియోజకవర్గ పరిథిలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యేల ఖర్చు భరించేందుకు కూడా ముందుకొచ్చాడు. దీంతో.. చంద్రబాబుకి వేరే ఆప్షన్‌ లేకుండా పోయింది. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా అంతిమంగా విశాఖ ఎంపీ సీటు బాలయ్య చిన్నల్లుడు అయిన భరత్‌కే కన్‌ ఫర్మ్‌ చేశారు. చంద్రబాబుతనే తనకు సీట్ ఇప్పించుకున్న శ్రీభరత్‌ డేర్‌ ని చూసి మిగిలిన టీడీపీ నాయకులు ఆశ్చర్యపోతున్నారు.
Tags:    

Similar News