సంచలన పరిణామం తాజాగా చోటు చేసుకుంది. తెలంగాణలో సంచలనంగా మారిన ఎంసెట్ స్కాంలో సీఐడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కుంభకోణంలో కార్పొరేట్ కాలేజీల హస్తముందన్న అనుమానాల్ని నిజం చేస్తూ.. తాజాగా పలువురు ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన నారాయణ.. చైతన్య విద్యా సంస్థలకు చెందిన వారు కావటం గమనార్హం.
2016లో వెలుగు చూసిన ఈ కుంభకోణాన్ని పరిశోధిస్తున్న సీఐడీ అధికారులు తాజాగా తొమ్మిది మంది నారాయణ.. చైతన్య విద్యాసంస్థలకు చెందిన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలతో నాంపల్లి కోర్టు లో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న తొంభై మంది పేర్లను కూడా ఛార్జిషీట్ లో పొందుపర్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ 64 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లుగా సీఐడీ పేర్కొంది. ఈ స్కాంలో ప్రైవేటు కాలేజీలైన నారాయణ.. చైతన్య కాలేజీల పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఉదంతం పై విచారణ పకడ్బందీగా సాగిందని.. ఆధారాల్ని కోర్టు ముందు పెట్టి.. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూస్తామని చెబుతున్నారు. మరీ.. ఉదంతంపై నారాయణ.. చైతన్య విద్యా సంస్థ రియాక్షన్ ఏమిటో..?