తెలుగు రాష్ట్రాల ప్రజలకు.. రెండు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు ‘శ్రీ చైతన్య విద్యాసంస్థలు’. ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్నేసి స్కూళ్లు.. కాలేజీలు.. క్యాంపస్ లు నిర్వహించటం సాధ్యం కాదేమో. అంత భారీ వాల్యూమ్ తో విద్యా సంస్థల్ని నిర్వహించే ఈ సంస్థకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారటమే కాదు.. ఇప్పుడు పెను సంచలనంగా మారింది. క్లాస్ రూంలో మాట్లాడిన ఒక విద్యార్థిని పట్టుకొని.. క్లాస్ టీచర్ సదరు విద్యార్థి చెంపలు రెండు వాయించటమే కాదు.. కాలితో దారుణంగా తన్నిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని శ్రీచైతన్య కాలేజ్ భాస్కర్ భవన్ క్యాంపస్ లో ఈ అమానుష సంఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. గురువారం క్లాస్ రూంలో జరిగిన ఈ ఉదంతాన్ని రహస్యంగా వీడియో తీయటం ద్వారా ప్రపంచానికి ఈ అమానుష ఘటన బయటకు వచ్చిన పరిస్థితి. ఈ వీడియో వైరల్ గా మారటంతో.. సదరుఅధ్యాపకుడి తీరుపై పలువురు మండి పడుతున్నారు.
ఈ వీడియోపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు రియాక్టుఅయ్యారు. చైల్డ్ లైన్ విభాగ అధికారులు రంగంలోకి దిగారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్.. జిల్లా విద్యాశాఖాధికారిరేణుక కాలేజీకి వెళ్లి విచారించారు. క్లాస్ రూంలో కూర్చొని పాఠాలు వినకుండా బాధిత విద్యార్థి ఇయర్ ఫోన్స్ లో పాటలు వింటున్నారని.. ఎంత చెప్పినా వినకపోయేసరికి క్షణికావేశంలో అలా చేసినట్లుగా బాధ్యుడైన లెక్చరర్ వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే బాధిత విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తమ అబ్బాయి వద్ద ఫోన్ లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదాస్పద వీడియోక్లిప్ బయటకు రావటంతో.. శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం తక్షణం స్పందించి.. బాధ్యుడైన సదరు అధ్యాపకుడ్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లుగా చెబుతున్నారు.
ఈ వైరల్ వీడియో నేపథ్యంలో.. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో చదువుతుంటే.. వారి పట్ల అధ్యాపకులు ఏ రీతిలో వ్యవహరిస్తున్నారన్న అంశాన్ని అడిగి తెలుసుకోవటం తల్లిదండ్రులుగా మీ బాధ్యత అని మర్చిపోవద్దు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Sri chaithanya
—
Bhaskar bhavan #Vijayawada.@ysjagan@AndhraPradeshCM@APPOLICE100 pic.twitter.com/yKyAKzvHdJ