ఈస్టర్ రోజున పక్కా ప్లాన్ తో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
207కు పెరిగిన మృతుల సంఖ్య, 500 వందల మందికి గాయాలు
మృతుల్లో ఓ భారతీయుడు సహా 27 మంది విదేశీయులు
కొలంబో దాడిలో అనంత టీడీపీ నేతకు స్వల్ప గాయాలు
శ్రీలంకలో నేటి ఉదయం నుంచి వరుసగా చోటుచేసుకున్న ఉగ్ర దాడులు మారణ హోమాన్నే సృష్టించాయి. క్రైస్తవుల పర్వదినం ఈస్టర్ సందర్భంగా చర్చీలు, స్టార్ హోటళ్లే లక్ష్యంగా విరుచుకుపడ్డ ఉగ్రవాదులు లంకలో నరమేధాన్ని సృష్టించారు. ఒకటి కాదు... రెండు కాదు.... ఒకేసారి ఏకంగా ఆరు చోట్ల విరుచుకుపడ్డారు. ఫలితంగా ప్రార్థనలతో ప్రశాంతంగా ఉన్న చర్చీలు, ఫారిన్ టూరిస్ట్ లతో కళకళలాడుతున్న స్టార్ హోటళ్లలో ఒక్కసారిగా కల్లోలం రేగింది. వరుసపెట్టి ఆరు చోట్ల ఒకేసారి బాంబు దాడులకు తెగబడ్డ ఉగ్రవాదులు... ఆ తర్వాత కాస్తంత గ్యాప్ ఇచ్చి మరో రెండు చోట్ల ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఎల్టీటీఈ ఉన్నకాలంలో లంకలో నిత్యం కల్లోల వాతావరణమే ఉండేది. అయితే ఎల్టీటీఈ అంతంతో ఇప్పుడక్కడ ప్రశాంత వాతావరణమే ఉందని చెప్పాలి. అయితే ఈ ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.
నేటి ఉదయం 8.45 గంటల సమయంలో వరుసపెట్టి ఆరు చోట్ల బాంబు పేలుళ్లలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కాస్తంత గ్యాప్ ఇచ్చి మరో రెండు చోట్ల కూడా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడ్డారు. మొత్తంగా నేటి ఉదయం నుంచి మధ్యాహ్నం సమయానికే ఉగ్రవాదులు యథేచ్ఛగా 8 చోట్ల దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 207 మంది చనిపోయినట్లుగా లంక ప్రభుత్వం ప్రకటించింది. మృతుల్లో 27 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో ఓ భారతీయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య ఇప్పటికే 500 దాటింది. వీరిలో తీవ్ర గాయాల్లో ప్రాణాలతో పోరాడుతున్న వారు చాలా మందే ఉన్నట్లుగా సమాచారం. వెరసి మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉగ్రదాడులు జరిగిన మరుక్షణమే తేరుకున్న లంక సర్కారు అప్పటికప్పుడే సహాయక చర్యల్లోకి దిగిపోయింది.
అయితే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ల సందర్భంగా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్నట్లు పది రోజులు ముందుగానే లంక ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయట. అయితే వాటిని అంత సీరియస్గా పట్టించుకోని కారణంగా లంక సర్కారు... ఈ హెచ్చరికలను లైట్ తీసుకుందట. దీంతో ఉగ్రవాదులు తాము రచించుకున్న ప్లాన్ ను ఏమాత్రం అవాంతరం లేకుండానే యథేచ్ఛగా కొనసాగించారు. ఉగ్రదాడులు చోటుచేసుకున్న 8 ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతోనే చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నా... ఇప్పటిదాకా ఇద్దరు ఉగ్రవాదులు మాత్రమే తమను తాము పేల్చేసుకున్నట్లు లంక పోలీసులు నిర్ధారించారు. మిగిలిన దాడులు జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. దాడుల నేపథ్యంలో శ్రీలంక భద్రతా సిబ్బంది అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తోంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఇవాళ నుంచి సోమవారం సాయంత్రం వరకూ కర్ఫ్యూ విధించింది. అలాగే సోషల్ మీడియాపై కూడా లంక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక పాఠశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించింది. పేలుడు జరిగిన ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించారు.
ఇదిలా ఉంటే... ప్రస్తుతం కొలంబో టూర్ లో ఉన్న తెలుగు, తమిళ నటి రాధిక ఈ ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. కొలంబోలోని ఓ హోటల్ లో బస చేసిన రాధిక... నేటి ఉదయం హోటల్ గదిని ఖాళీ చేసి వెళ్లిపోయారట. రాధిక వెళ్లిపోయిన కాసేపటికే ఆ హోటల్ పై ఉగ్రదాడి జరిగింది. ఏమాత్రం ఆలస్యం అయినా రాధిక కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయే వారే. తాను బస చేసిన హోటల్ పై ఉగ్రదాడి జరిగిందని తెలుసుకున్న రాధిక షాక్ కు గురయ్యారు. అయితే తాను దాడికి ముందే హోటల్ ను ఖాళీ చేశానని - తన గురించి ఆందోళన చెందాల్సి అవసరం లేదని తెలిపారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం లంకలో నలుగురు మిత్రులతో కలిసి జాలీ ట్రిప్ లో ఉన్న అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత అమిలినేని సురేంద్ర బాబు ఉగ్రదాడిలో స్వల్పంగా గాయపడ్డారు. కొలంబోలో ఆయన బస చేసిన హోటల్ పైనా ఉగ్రవాదులు బాంబు దాడులు చేశారు. ఈ దాడి సమయంలో హోటల్ లోనే టిఫిన్ చేస్తున్న సురేంద్ర బాబు... బాంబు పేలుళ్ల నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో స్వల్పంగా గాయపడ్డట్లు సమాచారం.