ప్రజల వద్ద అంతకంటే ఎక్కువ కరెన్సీ ఉండొద్దు.. ప్రభుత్వం ఆంక్షలు

Update: 2022-06-26 03:30 GMT
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. ప్రజల వద్ద డబ్బులు ఎన్ని ఉన్నా నిత్యావసరాలు దొరకడం గగనమైపోయింది. ఆహారం, ఇంధనంతో సహా నిత్యావసరాల దిగుమతులకు అవసరమైన ఫారెక్స్ నిల్వలు వేగంగా శ్రీలంక వద్ద కరిగిపోతున్నాయి.

ఈ క్రమంలోనే ఆ దేశం కొత్త ఆంక్షలను తీసుకొచ్చింది. తాజా నిబంధనలతో శ్రీలంకలో ఒక వ్యక్తి విదేశీ కరెన్సీని కలిగి ఉండే పరిమితిని 15000 అమెరికన్ డాలర్ల నుంచి 10000 డాలర్లకు తగ్గించింది.

విదేశాల నుంచి మద్దతు, సహకారం పొందేందుకు శ్రీలంక తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. శ్రీలంక తీవ్రమైన విదేవీ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇది ఏప్రిల్ లో లంక తన అంతర్జాతీయ చెల్లింపులను కట్టకుండా చేసింది. విదేశీ రుణాలను డిఫాల్ట్ చేసిన మొదటి ఆసియా పసిఫిక్ దేశంగా శ్రీలంక నిలిచింది.

ఈ క్రమంలోనే ప్రజల్లో చేతుల్లో ఉన్న విదేశీ కరెన్సీని అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి మళ్లించే ఉద్దేశంతో ఆర్థిక మంత్రి రణిల్ విక్రమసింఘే ఫారిన్ ఎక్స్చేంజ్ చట్టం కింద తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీ కరెన్సీని డిపాజిట్ చేయడానికి లేదా అధీకృత డీలర్ కు విక్రయించడానికి జూన్ 16, 2022 నుంచి 14 రోజుల పాటు అవకాశాన్ని కల్పించింది.

1948లో శ్రీలంక స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇది దేశవ్యాప్తంగా ఆహారం, మందులు, వంటగ్యాస్, ఇంధనం వంటి నిత్యావసర వస్తువల కొరతకు దారితీసింది. కొలొంబో ఏప్రిల్ లో రుణాలపై డిఫాల్ట్ గా ప్రకటించింది. దీని తర్వాత శ్రీలంక బాండ్ లను కలిగి ఉన్న అమెరికా బ్యాంక్ హామీల్టన్ రిజర్వ్ ఒప్పంద ఉల్లంఘనపై అమెరికా కోర్టులో దావా వేశారు.

దిగుమతుల కోసం ప్రభుత్వం డాలర్లను కనుగోనలేకపోవడంతో శ్రీలంక ప్రజలు సుధీర్ఘ ఇంధనం, వంట గ్యాస్ క్యూలలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆర్థిక సంక్షోభంపై శ్రీలంక ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ సంక్షోభం హింసాకాండకు దారితీసింది. ఒక ఎంపీ సహా 10 మంది మరణించారు. అధ్యక్షుడు రాజపక్సే కూడా రాజీనామా చేశారు.
Tags:    

Similar News