న‌డిసంద్రంలో గ‌జ‌రాజు..నేవీ సిబ్బంది సాహ‌సం!

Update: 2017-07-13 13:46 GMT
సాధార‌ణంగా ఏనుగులు అడ‌వుల‌కు స‌మీపంలో లోతు త‌క్కువ‌గా ఉన్న‌న‌దుల్లో సేద తీరుతుంటాయి. కానీ, సేద తీరుదామ‌ని స‌ముద్ర తీరానికొచ్చిందో గ‌జ‌రాజు. అంత‌లోనే రాకాసి అల ఒక‌టి ఆ ఏనుగును స‌ముద్రంలోకి లాక్కుని వెళ్లింది. క్ష‌ణాల్లోనే ఆ ఏనుగు న‌డిసంద్రంలోకి కొట్టుకుపోయింది. ఆ గ‌జ‌రాజును గ‌మ‌నించిన  నావికా ద‌ళ సిబ్బంది అతి క‌ష్ట‌మ్మీద ఆ ఏనుగును ర‌క్షించారు. ఈ ఘ‌ట‌న శ్రీ‌లంక స‌ముద్ర తీరంలో జ‌రిగింది.

శ్రీలంక నావికా దళ సిబ్బంది న‌డిసంద్రంలో మునిగిపోతున్న ఏనుగును దాదాపు 12 గంటలు శ్రమించి ర‌క్షించారు. ఈస్ట్రన్‌ నావల్‌ కమాండ్‌కు చెందిన నావికా సిబ్బంది రోజు వారి చర్యలో భాగంగా హిందూ మహాసముద్రంలోని తమ తీర రేఖ వెంబడి గస్తీకి వెళుతుండగా కోకిలాయ్‌లోని కొక్కుతుడువాయ్‌ అనే ప్రాంతంలో ఒక పెద్ద అల ఓ ఏనుగును నడిసంద్రంలోకి ఎత్తుకెళుతుండటం గమనించారు.

దీనిని గమనించిన వారు వెంట‌నే అత్యవసర విభాగానికి చెందిన సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే ప్రత్యేక స్మిమ్మింగ్‌ సూట్‌ లు ధరించి సముద్రంలోకి దిగిన వారు ఏనుగు మెడకు, నడుము భాగానికి తాడును తగిలించి తమ నౌక సహాయంతో ఒడ్డుకు చేర్చి అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. సైన్యం చేసిన ఈ పనికి పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ మొత్తం వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది.

Full View
Tags:    

Similar News