కడుపు మండిన ప్రజలు.. ఏకంగా.. ప్రధాన మంత్రి ఇంటిని తగలబెట్టేశారు. ఏకంగా అధ్యక్షుడి నివాసంలోకి చొచ్చుకెళ్లి.. దానిని స్వాధీనం చేసుకున్నారు ఇంట్లో ఉన్న ఈతకొలనులో ఈతకొట్టి ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఇదీ.. శ్రీలంకలో పరిస్థితి. శ్రీలంకలో నిరసనకారుల ఆగ్రహం చల్లారడం లేదు. అధ్యక్ష నివాసంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. తర్వాత ప్రధాని రణిల్ విక్రమసింఘే నివాసానికి నిప్పంటించారు. ప్రధానిగా రణిల్ రాజీనామా నిర్ణయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
ఆందోళనకారులను చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించినా.. వారిని దాటుకుంటూ లోపలికి వెళ్లిపోయా రు. ప్రధానికి చెందిన కొన్ని వాహనాలను సైతం ఆందోళనకారులు ధ్వంసం చేసినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. గత కొంత కాలంగా ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. తొలుత వేలాది మంది ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసంలోకి దూసుకెళ్లారు. అయితే, అంతకుముందే ఆయన తన ఇంటి నుంచి పరారయ్యారు.
ఈ క్రమంలోనే స్పీకర్ అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశం అనంతరం రణిల్ విక్రమసింఘే తన రాజీనామాను ప్రకటించారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పదవులకు రాజీనామా చేయాలని విక్రమసింఘే, గొటబాయలను పార్టీ నేతలు కోరిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. గొటబాయ రాజపక్స జులై 13న అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారని పార్లమెంటు స్పీకర్ వెల్లడించారు. కానీ, ఇంతలోనే.. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారానికి పైగా పెట్రోల్ ను నిలిపివేయడంతో.. రవాణా.. సహా ఇతర వ్యవస్థలు.. ఆహార రవాణా అన్ని ఆగిపోయాయి. దీంతో ప్రజలు నిప్పులు చెరుగుతూ.. రోడ్డెక్కారు.