ప్రపంచవ్యాప్తంగా పేరొందిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సమన్వయం లోపం వల్ల అబాసుపాలు అవుతోంది. ఏకంగా దేశ అధ్యక్షుడికి దక్కాల్సిన కనీస గౌరవం విషయంలోనే పట్టింపులేనితనంతో శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన మైత్రిపాల దేవదేవుడి వద్ద ఇక్కట్లు పడాల్సి వచ్చింది. కారు డ్రైవర్ కోసం సిరిసేన ఏకంగా పదినిమిషాలపాటు వేచి చూడాల్సి వచ్చింది. అధికారులు చూపిన ఈ అలసత్వంపై భక్తులు సైతం మండిపడుతున్నారు.
కలియుగం దైవం వెంకన్నను దర్శించుకునేందుకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ముందు రోజే తిరుమలకు చేరుకున్నారు. కుటుంసభ్యులతో సహా ఆయన దర్శనం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న మైత్రిపాల ఆలయం బయటకు వచ్చారు. కానీ అక్కడ డ్రైవర్ లేకపోవడంతో కారులోనే మైత్రిపాల కారులో కూర్చొవాల్సి వచ్చింది. ఇలా పది నిమిషాల పాటు కూర్చొన్నారు. ఆయన దర్శనం కోసం ఏర్పాట్లు చేసిన అధికారులు దేశధ్యక్షుడి సిబ్బందిని మర్చిపోయారు. దీంతో పదినిమిషాల నిరీక్షణ అనంతరం డ్రైవర్ వచ్చారు. ఈ పరిణామంపై మైత్రిపాల ఇబ్బంది పడ్డారు.
పొరుగు దేశాధ్యక్షుడికి జరిగిన ఇబ్బందికర పరిణామం వార్తల రూపంలో వెలుగులోకి అంతా ఆశ్చర్యపోయారు. ఓ దేశాధ్యక్షుడు వేచి చూసేలా చేసిన ఆలయ అధికారుల తీరుపై ఆయన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మండిపడ్డారు. ప్రముఖుల పర్యటనలో సమన్వయం లోపిస్తే అబాసుపాలు కావాల్సి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. డ్రైవర్ కు దర్శనానికి వెళ్లేందుకు ఎవరు అనుమతినిచ్చారు ? ఆయన ఎలా వెళ్లాడనేది విషయాలను ఆరాతీస్తున్నారు.