ఇప్పటికే ఎన్నో రకాల వ్యాధులు, వైరస్, బ్యాక్టీరియాలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తరకం రోగాలు వచ్చే కొద్దీ టీకాలను అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కూడా టీకాతో కాస్త కట్టడి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి . అయితే ఈ వ్యాక్సిన్ల అభివృద్ధిలో పీతల రక్తం కీలకమని మీకు తెలుసా?.. ఏటా ఎంతోమంది ప్రజల ప్రాణాలకు ఆ పీతల రక్తం శ్రీరామ రక్షగా ఉంటుందని ఎప్పుడైనా విన్నారా? మనిషి ఆరోగ్యానికి... పీతల రక్తానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..! సంబంధం ఉంది. ఆ పీతలు వాటి రక్తాన్ని ధారపోసి సైతం మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి.
ప్రపంచంలోని నిత్యం ఎంతో మంది వివిధ రకాల టీకాలు తీసుకుంటారు. కరోనా లాంటి మహమ్మారి కాకుండా ఇతర వైరస్ లకు కూడా ఇప్పటికే ఎన్నో టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ టీకాల పరిశోధనలో పీతల రక్తం చాలా కీలకం. కేవలం కరోనాను కట్టడి చేసే టీ కాలే కాదు... ఏ తరహా టీకా అయినా కూడా పీతల రక్తంతోనే పరీక్షిస్తారు. వివిధ కంపెనీలు అభివృద్ధి చేసిన టీకాలు ఎంతవరకు సురక్షితమైనవి? వాటిలో హానికరమైన బ్యాక్టీరియా ఉందా? అని తెలుసుకోవడానికి క్రాబ్ రక్తాన్ని ఉపయోగిస్తారు. అయితే అన్ని రకాల పీతల రక్తం ఈ పరిశోధనలకు ఉపయోగపడదు. నీలి రంగు వర్ణంలో రక్తం కలిగిన హార్స్ షూ క్రాబ్ ను మాత్రమే వినియోగిస్తారు. వీటి రక్తం చాలా ఖరీదైనది. మార్కెట్లో లీటర్ రూ.12 లక్షల ధర పలుకుతుంటుంది.
తాబేలుకు ఉన్నటువంటి డొప్ప లాంటి తలభాగం, పది కళ్లను హార్స్ షూ క్రాబ్ కలిగి ఉంటుంది. వేలాడుతున్న శరీరంతో చిత్రమైన రూపం గల ఈ జీవి.. అత్యద్భుతమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. అతిచిన్న బ్యాక్టీరియాను సైతం గుర్తించగలిగే సామర్థ్యం ఉంటుంది. ఈ మహా దివ్యశక్తిని గుర్తించిన శాస్త్రవేత్తలు... వ్యాక్సిన్ల పరిశోధనలకు ఉపయోగపడుతుందని తెలిపారు. అవి ఎంతవరకు సురక్షితమో తెలుసుకోవడానికి వినియోగిస్తున్నారు. ఇవి 45 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పటికే అదే పరిమాణంలో ఉండడం గమనార్హం.
హార్స్ షూ క్రాబ్ రక్తం నీలి రంగులో ఉంటుంది కనుక టీకా ఎంతవరకు సురక్షితమని తెలుసుకోవచ్చునని నిపుణులు అంటున్నారు. క్రాబ్ గుండె రక్త కణాల నుంచి రక్తాన్ని సేకరిస్తారు. ఈ రక్తంలో రక్తనాళాలను తొలగిస్తారు. అనంతరం ఎల్ఏఎల్ ను ఉత్పత్తి చేస్తారు. ఈ ఎల్ ఏ ఎల్ అతి సూక్ష్మాతి సూక్ష్మ మైన బ్యాక్టీరియాను సైతం గుర్తించగలుగుతుంది. ఈ విధంగా వ్యాక్సిన్ పరీక్షిస్తారు. అందులో ఎటువంటి హానికరమైన బ్యాక్టీరియా లేదని గుర్తించిన అనంతరమే వినియోగానికి అనుమతి ఇస్తారు.
హార్స్ షూ క్రాబ్ రక్తంతో కేవలం టీకాలు మాత్రమే కాదు స్టంట్స్, సర్జికల్ ఎక్విప్ మెంట్స్ వంటి వాటిని సైతం పరీక్షిస్తారు. అందుకే ఈ పీతల రక్తానికి చాలా డిమాండ్ ఉంది. ఇందుకోసం ఫార్మా కంపెనీలు కూడా ఎక్కువ ఖర్చు చేస్తాయట. ఈ విధంగా వివిధ రకాల వ్యాక్సిన్ల తయారీకి ఎన్నో పీతల రక్తాన్ని పీల్చేస్తున్నారు. అవి తమ రక్తం ధారపోస్తేనే లక్షల మంది... వ్యాక్సిన్లు పొంది వివిధ రకాల అనారోగ్యాల నుంచి దూరంగా ఉండగలుగుతున్నారు. ఈ విధంగా ఆ పీతలు కోట్లాది మంది ప్రాణాలకు శ్రీరామరక్షగా మారాయని చెప్పవచ్చు.