జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నిత్యం విరుచుకుపడే కత్తి మహేశ్ కొద్దికాలంగా గ్యాప్ ఇచ్చారు. అయితే, ఆయన తలనొప్పి తగ్గిందనుకునేసరికి పవన్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. పవన్‌పై కత్తి కంటే ఘాటైన విమర్శలు చేస్తున్నారు టాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డి. పవన్ ను అన్న అనుకున్నందుకు తనను తాను చెప్పుతో కొట్టుకోవాలన్నారామె.
'తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ అంశంపై రెండో రోజూ చర్చా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘ఒక్కొక్కళ్ల జాతకాలు బయటకొచ్చినప్పుడు.. హీరోలకు సంబంధించిన అభిమానులు దయచేసి మమ్మల్ని వేధింపులకు గురి చేయొద్దు. పవన్ కల్యాణ్ ! నువ్వు ప్రజానాయకుడివి అయి ఉండి ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ కు వెళ్లమని చెబుతున్నావు? నువ్వు చెప్పాలి నాకు సలహా! ‘పవన్ కల్యాణ్ అన్న’ అన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా. ఇకపై పవన్ కల్యాణ్ ని ఏ అమ్మాయి కూడా ‘అన్న’ అనొద్దు..’ అంటూ రాయడానికి వీలులేని భాషలో పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి నేనొక్కటే చెబుతున్నా. కొన్నిరోజులుగా మేము నోరు విప్పి మాట్లాడుతున్నాం.. మమ్మల్ని తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ గారూ! మీ ఫ్యాన్స్ ని ఆమాత్రం కంట్రోల్ లో పెట్టుకోలేరా? అసలు ఆయనకు ఒక్కరికే ఫ్యాన్స్ ఉన్నారా? మేము భయపడాల్సిన అవసరమేమీ లేదు’ అని చెప్పింది.
సినిమాల్లో అవకాశాలు దొరక్క, ఉపాధిలేక, పూటగడవని ఆర్టిస్టులు వ్యభిచారం బాట పడితే, ప్రభుత్వం దానిని కూడా బ్యాన్ చేసిందని, మరి ఆర్టిస్టులు ఎలా బతకాలి అని ఆమె ప్రశ్నించింది. ‘వ్యభిచారాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అడుగుతున్నా. మరి, మేము ఎలా బతకాలి? సినీ ఇండస్ట్రీ అన్నం పెట్టదు. మేము ఆర్టిస్టులం.. ఆర్టిస్టులుగానే ఉంటాం..ఇక్కడే చచ్చిపోతాం. మాకు వేరే అవసరం లేదు. కళామతల్లికే మా జీవితం అంకితం. పెట్టుబడిదారుడు వాడి ఇష్టం వచ్చినట్టు వాడు సినిమా తీసుకుంటాడు. మీకెందుకు అవకాశాలిస్తారని కొంతమంది నిర్మాతలు మాట్లాడుతున్నారు. ముంబై వాళ్లను ఆర్టిస్టులుగా తీసుకుంటే ముంబైకు, విదేశీ ఆర్టిస్టులను తీసుకుంటే విదేశాలకు వెళ్లి సినిమాలు తీసుకుని, అక్కడే రిలీజ్ చేసుకోండి. తెలుగు ప్రాంతాల్లో ఆ సినిమాలను రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేసింది.