టాలీవుడ్ నటి శ్రీరెడ్డి వ్యవహారంలో మీడియాకు చెందిన కొందరు ప్రముఖుల్ని చేరుస్తూ కొన్ని నకిలీ వాట్సాప్ చాట్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా టీవీ9 ఛానల్ సీఈవో.. మీడియా ప్రముఖుడు రవిప్రకాశ్ పై ఒక వాట్సాప్ చాట్ వైరల్ అవుతోంది. ఇందులో శ్రీరెడ్డి హాట్ ఫోటోలు తనకు పంపాలని.. టీవీ9లో పని చేసే అవకాశం కావాలంటే తన గెస్ట్ హౌస్ కు రావాలంటూ అసభ్యకరమైన పోస్టులు ఉన్నాయి.
అయితే.. ఈ వాట్సాప్ చాట్ అంతా ఫేక్ అని.. వైరల్ అవుతున్న ఆ చాట్ ను దయచేసి ఎవరూ నమ్మొద్దంటూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించారు. మరోవైపు ఈ అంశాన్ని టీవీ9 సీరియస్ గా తీసుకుంది. తమ సీఈవోపై అసభ్యకర పోస్టింగ్ లు చేస్తున్న వైనంపై ఛానల్ అస్టిస్టెంట్ మేనేజర్ కె.శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు.
శ్రీరెడ్డితో రవిప్రకాశ్ అసభ్యంగా ప్రవర్తించినట్లుగా వైరల్ అవుతున్న ఫేక్ పోస్టుల్ని.. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లను జత చేశారు. తమ సీఈవో రవిప్రకాశ్ పరువు తీసేందుకు గుడ్ల శివకుమార్ అనే వ్యక్తి పోస్టు చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీరెడ్డితో లింకు పెడుతూ..కొన్ని ఛానళ్ల ముఖ్యులపై జరుగుతున్న ఫేక్ పోస్టుల వ్యవహారం ఇటు మీడియాలోనూ.. అటు సినిమా ఇండస్ట్రీలోనూ సంచలనంగా మారింది. దీని వెనుక ఉన్నదెవరన్న ప్రశ్నలు అందరిని వేధిస్తున్నాయి.