అసెంబ్లీ నియోజకవర్గం: శ్రీకాకుళం
వైసీపీ: ధర్మాన ప్రసాదరావు
టీడీపీ: గుండా లక్ష్మీదేవి
జనసేన: కోరాడ సర్వేశ్వర్ రావు
ఏపీలో చిట్ట చివరి జిల్లా శ్రీకాకుళం. రెండు నదుల మధ్య విస్తరించిన ఈ జిల్లాలో రాజకీయం రసకందాయంగానే ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో ధర్మాన - గుండా కుటుంబాల మధ్య పోరు సాగుతోంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పోటీ చేస్తుండగా వైసీపీ నంచి ధర్మాన ప్రసాదరావు బరిలో ఉన్నారు. ఇక జనసేన నుంచి కోరాడ సర్వేశ్వర్ రావు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గం: శ్రీకాకుళం
మండలాలు: గార - శ్రీకాకుళం
ఓటర్లు: 2 లక్షల 42 వేలు
నియోజకవర్గం చరిత్ర:
స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుంచి శ్రీకాకుళం రాజకీయంగా కీలకంగానే ఉంటోంది. ఇప్పటి వరకు ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ 6 సార్లు - కాంగ్రెస్ 4 సార్లు విజయం సాధించాయి. మొదటి ఎమ్మెల్యేగా కేఎల్ పీ అభ్యర్థి కావలి నారాయణ గెలుపొందారు.
* గుండా లక్ష్మీదేవీ రెండోసారి పోటీ..
మాజీ మంత్రి గుండా అప్పల సూర్య నారాయణ శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ నుంచి నాలుగుసార్లు గెలుపొందారు. ఆయన సతీమణి గుండా లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై గెలుపొందారు. శ్రీకాకుళం రాజకీయ చరిత్రలో మహిళా అభ్యర్థిగా గెలిచి లక్ష్మీదేవి రికార్డులోకెక్కారు. ఇక్కడ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఆమె గెలుపు సునాయాసంగా మారింది. ప్రస్తుతం కూడా మహిళా ఓటర్లే టీడీపీని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని శాలిహుండాలో రూ.4.5కోట్లతో నీటి ప్రాజెక్టు రెండో విడత పనులు - మౌలిక సదుపాయాలు కల్పించామని లక్ష్మీదేవి ప్రచారం చేస్తున్నారు.
*అనుకూలతలు:
-టీడీపీకి కంచుకోట
-అభివృద్ధి పనులు
-భర్తపై ఉన్న అభిమానం
* ప్రతికూలతలు:
-మాజీ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు బరిలో ఉండడం
-వైసీపీ బలపడడం
*ధర్మాన వైసీపీ జెండా ఎగురవేస్తారా..?
టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ నుంచి 2004 - 2009 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలుపొందారు. వైఎస్ హయాంలో మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని శ్రద్ధతో అభివృద్ధి చేశారు. రోడ్ల విస్తరణ - తాగునీటి విస్తరణ - అరసవల్లి సమీపంలోని ఆధునాతన ఆడిటోరియం లాంటి అభివృద్ధి పనులు చేపట్టారు. 2014లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతతోనే ఆయన ఓటమి చెందినట్లు ప్రచారం ఉంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని ధర్మాన చెబుతున్నారు.
*అనుకూలతలు:
-రెండుసార్లు ఎమ్మెల్యేగా - మంత్రిగా పనిచేసిన అనుభవం
-ఆయన హయంలో చేసిన అభివృద్ధి పనులు
-వైసీపీ నేత జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడం
* ప్రతికూలతలు:
-నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువ
-టీడీపీకి కేడర్ బలంగా ఉండడం
*టఫ్ ఫైట్ లో గెలుపెవరిది.?
పవన్ ఇమేజ్ తో కోరాడ విశ్వేశ్వర్ రావు బరిలో ఉన్నా ప్రధానంగా పోటీ మాత్రం టీడీపీ - వైసీపీల మధ్యే పోరు సాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించగా.. ఐదేళ్లలో ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరి నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటించారు. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. దీంతో ఈసారి వైసీపీ జెండా ఎగురవేస్తానని చెబుతున్నారు. అయితే అనాధిగా టీడీపీకి అండగా శ్రీకాకుళంలో వైసీపీ ఏమేరకు విజయం సాధిస్తుంది? ధర్మానా సీనియారిటీ కలిసివస్తుందా అనేది ఆసక్తిగా మారింది.