కంటికి కనిపించని ఈ మహమ్మారి కారణంగా ప్రజలకు తెస్తున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ మహమ్మారిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ అందరూ స్తంభించిపోయారు. అలాగే, ఈ లాక్ డౌన్ కారణంగా ఉపాధిలేక పొట్ట చేత పట్టుకుని స్వంత ఊర్లను, రాష్ట్రాలనూ వదిలి పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్న కూలీల వ్యధలు కథలు కథలుగా వస్తూనే ఉన్నాయి. అయితే, ఇలా పనులు లేక సొంత ఊర్లకి వెళ్లేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురౌతున్నారు.
ఈ మధ్య తరుచూగా ఏదో ఒక చోట వారు ప్రయాణిస్తున్న వాహనాల్లో అపశృతి చోటు చేసుకుంటూనే ఉంది. దీంతో ఎన్నో ఆశలతోొ సొంత ఊళ్లకు వెళ్దామని అనుకుంటున్నవారి ఇళ్లలో విషాదం నింపుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో 33 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన బాధితులందరూ కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.