శ్రీకాకుళం జిల్లాను తాకిన కరోనా సెగ..ఆ ఒక్కడి వల్లే!

Update: 2020-04-25 09:10 GMT
ఆంధప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభణ క్రమక్రమంగా పెరిగిపోతుంది. తాజాగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది.  ఈ రోజు కొత్తగా 61 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా ఫ్రీ జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారుల్లో కూడా కలవరం ప్రారంభమైంది. ఆ మూడు కేసులు కూడా ఒకే కుటుంబం లో వారికే నిర్థారణ అయినట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాలు చూస్తే .. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంకు చెందిన వ్యక్యతి ఢిల్లీలో రైల్వేస్ ‌లో పనిచేస్తున్నాడు. అతడు మార్చిలో తన సొంత ఊరికి వచ్చాడు. ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్‌ లో ఉన్నాడు.  క్వారంటైన్ ముగిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి కొందరిని కలిసినట్లు సమాచారం. ఈ తరుణంలోనే అతనికి కరోనా లక్షణాలు బయటపడటంతో ఆ వ్యక్తికి ముందు ర్యాపిడ్ టెస్ట్ చేయగా - పాజిటివ్ రావడంతో - ట్రూనాట్ పరికరం ద్వారా రిమ్స్ ‌లో మరోసారి పరీక్షించారు. ఆ శాంపిళ్లను కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలోని ల్యాబ్‌ కు పంపించగా ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి నెగిటివ్ రాగా, విచిత్రంగా అతడు కలిసిన ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. ఢిల్లీ నుండి వచ్చిన అతడు కరోనా బాధితుడు తబ్లీగ్ జమాత్ ‌లతో కలిసి ఏపీ ఎక్స్ ‌ప్రెస్ ‌లో ప్రయాణించినట్లు తెలుస్తోంది.

దీనితో ఆ ముగ్గురితో సన్నిహితంగా ఉన్న వారి వివరాలు ఆరా తీసి, ఇప్పటికే పలువుర్ని క్వారంటైన్‌ కు తరలించారు. అలాగే బాధితులు ఉంటున్న ప్రాంతంలో శానిటేషన్ చేపట్టారు. స్థానిక ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. ఆ ప్రాంతాన్ని రెడ్‌ జోన్ ‌గా ప్రకటించారు. ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. నిత్యావసరాలు సైతం ఇళ్లకే పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News